రాజ్యాంగం వల్లే భారత్ఐక్యంగా ఉంది: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

రాజ్యాంగం వల్లే భారత్ఐక్యంగా ఉంది: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

రత్నగిరి: భారత రాజ్యాంగం దేశాన్ని బలంగా, ఐక్యంగా ఉంచిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. పొరుగు దేశాలు అల్లర్లు, అశాంతితో అల్లాడుతుంటే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారత్‌‌ను స్థిరంగా, అభివృద్ధి పథంలో నడిపిందన్నారు. ఆదివారం మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా మందన్‌‌గడ్‌‌లో కొత్త కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించా రు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్వస్థలమైన అంబవ్డే దీని పరిధిలోనే ఉండటం సంతోషంగా ఉందన్నారు. యుద్ధం, శాంతి, అంతర్గత ఎమర్జెన్సీ సమయాల్లోనూ దేశం ఐక్యంగా ఉందన్నారు. పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌‌లలో అశాంతి నెలకొంటే.. భారత్‌‌లో రాజ్యాంగం దేశాన్ని శాంతితో బలంగా ఉంచిందన్నారు.