సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా

సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా

కకమిగహర (జపాన్‌‌‌‌‌‌‌‌):  ఇండియా జూనియర్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. గురువారం జరిగిన పూల్‌‌‌‌‌‌‌‌–ఎ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా అమ్మాయిలు 11–0తో చైనీస్‌‌‌‌‌‌‌‌ తైపీ జట్టును చిత్తు చేశారు. అన్ను, సునేలిత రెండేసి గోల్స్‌‌‌‌‌‌‌‌తో రాణించారు.

గ్రూప్‌‌‌‌‌‌‌‌ దశలో మూడు విజయాలు, ఓ డ్రాతో ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సెమీస్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయింది. శనివారం జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌లో జపాన్‌‌‌‌‌‌‌‌ లేదా కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది.