IND vs ENG 2025: ఇంగ్లాండ్‌కు టెన్షన్, టెన్షన్.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే.. ?

IND vs ENG 2025: ఇంగ్లాండ్‌కు టెన్షన్, టెన్షన్.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే.. ?

ఓవల్ వేదికగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు రెండో సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు రాణించడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. జైశ్వాల్ (118) సెంచరీతో టీమిండియా మూడో రోజు టీ విరామానికి 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (26), జురెల్ (25) ఉన్నారు. ప్రస్తుతం ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 281 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో సెషన్ లో ఎవరు ఆధిపత్యం చూపిస్తారో మ్యాచ్ వారే గెలిచే ఛాన్స్ ఉంది. జడేజా, జురెల్ పైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. 

3 వికెట్ల నష్టానికి 189 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా.. తొలి బంతికే గిల్ (11) ఔటయ్యాడు. అట్కిన్సన్ ఇన్ స్వింగ్ ధాటికి గిల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. ఈ దశలో కరుణ్ నాయర్, జైశ్వాల్ స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పోయి భారత ఆధిక్యాన్ని 200 కు చేర్చారు. ఈ క్రమంలో జైశ్వాల్ 127 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. 17 పరుగులు చేసిన కరుణ్ అట్కిన్సన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే జైశ్వాల్ (118) ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. 

ALSO READ :IND vs ENG 2025: సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. 200కు చేరిన టీమిండియా ఆధిక్యం

జురెల్, జడేజా టీ విరామానికి మరో వికెట్ పడకుండా సెషన్ ముగించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. టంగ్ రెండు.. ఓవర్దన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 114 పరుగులు రాబట్టుకుంది. మూడో రోజు జైశ్వాల్(117) సెంచరీ.. ఆకాష్ దీప్ హాఫ్ సెంచరీ హైలెట్ గా నిలిచాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.