బుమ్రా దెబ్బకు రోహిత్‌ విలవిల

బుమ్రా దెబ్బకు రోహిత్‌ విలవిల

లీసెస్టర్‌‌‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌లో ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో మెరుపులు మెరిపించిన ఇండియా టాప్‌‌‌‌ ప్లేయర్లు.. లీసెస్టర్‌‌‌‌షైర్‌‌‌‌తో గురువారం మొదలైన వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఫెయిలయ్యారు. 20 ఏళ్ల యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ రోమన్‌‌‌‌ వాకర్‌‌‌‌ (5/24) స్వింగ్‌‌‌‌, బౌన్స్‌‌‌‌ దెబ్బకు టీమిండియా టాపార్డర్‌‌‌‌ కుదేలైంది. అయితే తెలుగు కుర్రాడు శ్రీకర్‌‌‌‌ భరత్‌‌‌‌ (111 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 70  బ్యాటింగ్​) పోరాట స్ఫూర్తి చూపెట్టాడు.  మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ (33)తో కలిసి కీలక భాగస్వామ్యంతో టీమ్​ను ఆదుకున్నాడు.  వర్షం పలుసార్లు అంతరాయం కలిగించిన పోరులో  మొదటి రోజు చివరకు ఇండియా 60.2 ఓవర్లలో 246/8 స్కోరు చేసింది. భరత్‌‌‌‌తో పాటు మహ్మద్‌‌‌‌ షమీ (18 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు.  

81కే 5 వికెట్లు..

మేఘావృత వాతావరణంలో టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఆరంభం కలిసి రాలేదు. మంచి టచ్‌‌‌‌లో కనిపించిన రోహిత్‌‌‌‌ శర్మ (25)   తన షార్ట్‌‌‌‌ పిచ్‌‌‌‌ బలహీనతకు మరోసారి బోల్తా పడ్డాడు. వాకర్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌ బాల్​ను ఫుల్‌‌‌‌ చేయబోయి క్యాచ్​ ఇచ్చాడు.  ఇక, ఓపెనర్‌‌‌‌గా వచ్చిన అవకాశాన్ని శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (21) ఒడిసి పట్టుకోలేకపోయాడు. డావిస్‌‌‌‌ (2/64) స్వింగ్‌‌‌‌ను అర్థం చేసుకోలేక ఔటయ్యాడు. ఐదో నంబర్‌‌‌‌ కోసం పోటీలో ఉన్న హనుమ విహారి (3), శ్రేయస్‌‌‌‌ (0) కూడా నిరాశ పరిచారు.  కోహ్లీ మాత్రం ఓపిక చూపెట్టాడు. బాల్​ ఎక్కువ  స్వింగ్‌‌‌‌ అవడంతో తను డిఫెన్స్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వగా, జడేజా (13) ఎక్కువసేపు నిలబడలేదు. దీంతో ఇండియా 81 రన్స్‌‌‌‌కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రీకర్‌‌‌‌ నిలకడైన ఆటతో కోహ్లీకి అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఇండో–ఇంగ్లిష్‌‌‌‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. కానీ, మరో స్పెల్‌‌‌‌కు వచ్చిన వాకర్‌‌‌‌ వరుస ఓవర్లలో కోహ్లీ, శార్దూల్‌‌‌‌ (6)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. ఉమేశ్‌‌‌‌ (23) అండతో స్కోరు 200 దాటించిన భరత్​.. షమీతో కలిసి మరో వికెట్‌‌‌‌ పడకుండా రోజు ముగించాడు.

బుమ్రా దెబ్బకు రోహిత్‌ విలవిల

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌లో మనోళ్లకు మనోళ్లే ప్రత్యర్థులయ్యారు. అనధికార మ్యాచ్‌‌‌‌ కావడంతో ఎక్కువ మందికి ప్రాక్టీస్‌‌‌‌ లభించేందుకు బుమ్రా, ప్రసిధ్‌‌‌‌, పంత్‌‌‌‌, పుజారా లీసెస్టర్‌‌‌‌ తరఫున బరిలోకి దిగారు. యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే ఇండియా స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ బుమ్రా.. ఈ సారి రోహిత్‌‌‌‌ శర్మకు తన బౌలింగ్‌‌‌‌ పదును చూపెట్టాడు. తొలిసారి ఓ కాంపిటీటివ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బుమ్రాను ఎదుర్కొన్న హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ అతని బాల్స్‌‌‌‌కు ఇబ్బంది పడ్డాడు. ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ రైజింగ్‌‌‌‌ బాల్‌‌‌‌ రోహిత్‌‌‌‌కు గజ్జల్లో బలంగా తగిలింది.  నొప్పికి విలవిల్లాడిన ఇండియా కెప్టెన్‌‌‌‌ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు. దాంతో, అంతా కంగారు పడ్డారు. ఫిజియో వచ్చి పరీక్షించాడు. ఆ తర్వాత రోహిత్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కొనసాగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆపై, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ను ప్రసిధ్‌‌‌‌ కృష్ణ తన తొలి బాల్‌‌‌‌కే ఔట్‌‌‌‌ చేయడం విశేషం. 

టీమ్‌‌‌‌లోకి అశ్విన్‌‌‌‌

కరోనా నుంచి కోలుకున్న స్పిన్నర్​అశ్విన్‌‌‌‌ గురువారం టీమ్‌‌‌‌తో కలిశాడు. వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ మొదలయ్యే ముందు మిగతా ఆటగాళ్లతో కలిసి తను గ్రౌండ్‌‌‌‌లో కనిపించాడు