మూడు కీలకమైన వికెట్లను కోల్పోయిన టీమిండియా

 మూడు కీలకమైన వికెట్లను కోల్పోయిన టీమిండియా

బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (2) పరుగులకే ఔటయ్యాడు.  షకీబ్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతిని నురుల్‌ హసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తొలి టెస్టులో నిలకడగా ఆడిన ఛెతేశ్వర్ పుజారా (6) కూడా త్వరగానే ఔటయ్యాడు.  మెహిదీ హసన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన పుజారా స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కాస్త క్రీజ్ లో నిలదొక్కుకున్నట్లుగా కనిపించిన మరో ఓపెనర్  గిల్ (7) కూడా ఔటయ్యాడు. 

 ప్రస్తుతం 14  ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 29  పరుగులు చేసింది. క్రీజ్‌లో అక్షర్ పటేల్‌ (14*), విరాట్ కోహ్లీ ఉన్నారు. టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 116 పరుగులు అవసరం.  అంతకుముందు బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 231  పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా టార్గెట్ 145 పరుగులుగా ఉంది. కాగా బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది.