చెలరేగిన యూసఫ్ పఠాన్... ఇండియా మహరాజాస్ గెలుపు

చెలరేగిన యూసఫ్ పఠాన్... ఇండియా మహరాజాస్  గెలుపు

లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ప్రత్యేక మ్యాచ్లో ఇండియా మహరాజాస్  విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరల్డ్ జెయింట్స్  విసిరిన 171 పరుగుల టార్గెట్ను ఇండియా మహరాజాస్ 18.4 ఓవర్లలోనే ఛేదించింది. 

ఒబ్రెయిన్ హాఫ్ సెంచరీ 
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో..ముందుగా  టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి రామ్ దిన్ 42 పరుగులు, తిషారా 25 రన్స్తో రాణించారు. మహారాజాస్ బౌలర్లలో పంకజ్ సింగ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. 

పఠాన్ ధనాధన్ బ్యాటింగ్..
171 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన  ఇండియా మహారాజాస్  కేవలం 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో యూసుఫ్ పఠాన్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అతనికి  తన్మయ్ శ్రీవాత్సవ  39 బంతుల్లో 54 పరుగులు చేసిన సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 103 పరుగుల పాట్నర్ షిప్ అందించారు. చివర్లో  ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 20 పరుగుల ధనాధన్ ఇన్నింగ్ ఆడటంతో..ఇండియా మహరాజాస్.. 6 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. జెయింట్స్ బౌలర్ బ్రెస్నన్ 3 వికెట్లు తీశాడు.