ల్యాప్ టాప్, కంప్యూటర్ ధరలు పెరగనున్నాయా.. కారణం ఏంటంటే..?

ల్యాప్ టాప్, కంప్యూటర్ ధరలు పెరగనున్నాయా.. కారణం ఏంటంటే..?

విదేశాల నుంచి ల్యాప్ టాప్‌లు, పర్సనల్  కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆగస్టు3న ప్రకటనలో తెలిపింది. చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఆపిల్, డెల్, శామ్‌సంగ్ వంటి బడా కంపెనీలను తీవ్రంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దెబ్బతీసే అవకాశం ఉంది.  ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ల్యాప్‌టాప్‌లను ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.  

ఇన్‌బౌండ్ టీవీ షిప్‌మెంట్‌ల కోసం 2020లో దేశం విధించిన పరిమితుల మాదిరిగానే ఈ ఉత్పత్తులకు ప్రత్యేక లైసెన్స్‌ను తప్పనిసరి చేస్తుంది. ఇదే అంశంపై ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ..  లైసెన్సింగ్ పాలన అంటే వారు లాంచ్ చేసే ప్రతి కొత్త మోడల్ కోసం  నిరీక్షించాల్సి ఉంటుందని అన్నారు. ఇండియాలో సాధారణంగా అమ్మకాలు పండుగ సీజన్లలో పెరుగుతాయని ప్రభుత్వ లైసెన్సింగ్ విధానం వల్ల సేల్స్ పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. 

అయితే ఈ నిర్ణయం   "మేక్ ఇన్ ఇండియా" పథకం కింద స్థానిక తయారీని ప్రోత్సహించి.. విదేశాల నుంచి ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దిగుమతిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.  ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లతో సహా దేశ ఎలెక్ట్రానిక్స్ దిగుమతులు ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో  6.25% పెరిగి  19.7 బిలియన్ డాలర్లకు  చేరుకున్నాయి. 

ఇవి వార్షిక దిగుమతుల్లో 1.5% వాటాను కలిగి ఉన్నాయి, ప్రభుత్వ డేటా ప్రకారం చైనా నుండి దాదాపు సగం ఎలెక్ట్రానిక్ ఐటెమ్స్ దిగుమతి అవుతుండటం గమనార్హం. యాపిల్ కి చెందిన ఉత్పత్తులు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అయితే ఒకే సారి దిగుమతులకు లైసెన్స్ లంటూ నిబంధనలు పెడితే ఎలెక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.