దేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్

దేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన 60 శాతం మంది జనాభాకు టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఇందుకు కృషి చేసిన హెల్త్ వర్కర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ మైలురాయిని అందుకోవడానికి సహకరించిన పౌరులకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలో మరిన్ని రికార్డులను అందుకోవడమే ధ్యేయంగా పని చేస్తామన్నారు.

కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,960 మంది బాధితులు కోలుకున్నారు. అలాగే ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ కేసులు భారత్ లోనూ రోజురోజుకీ పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 65 మంది కొత్త వేరియెంట్ బారినపడగా.. ఢిల్లీలో 64, తెలంగాణ 24, రాజస్థాన్ 21, కర్నాటక 19, కేరళ 15, గుజరాత్ 14, జమ్మూకాశ్మీర్ లో 3, ఏపీ, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ లో 2, చండీఘడ్, లద్దాఖ్, తమిళనాడు, బెంగాల్లో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తల కోసం: 

బిగ్​బాస్​పై ఫైర్​ అయితున్నరు

న్యూ ఇయర్ కోసం గోవా నుంచి డ్రగ్స్

బియ్యం నిల్వల పేరుతో రాష్ట్రాలకు మొండిచేయి