అతిపెద్ద స్క్రీన్‌‌‌‌పై ఇండియా– పాక్‌‌‌‌ మ్యాచ్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో నమోదు

అతిపెద్ద స్క్రీన్‌‌‌‌పై ఇండియా– పాక్‌‌‌‌ మ్యాచ్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో నమోదు

హైదరాబాద్, వెలుగు :  వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా శనివారం ఇండియా–- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌‌‌‌ను   సిటీలోని క్రికెట్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ కోసం   హైటెక్స్‌‌‌‌లో అతిపెద్ద స్క్రీన్‌‌‌‌లపై చూపెట్టారు. పెర్నోడ్ రికార్డ్ ఇండియా  లిమిటెడ్ అనే సంస్థ  ఆధ్వర్యంలో 80 అడుగుల వెడల్పు, 36 అడుగుల ఎత్తు గల‌‌‌‌ అతిపెద్ద స్క్రీన్లపై మ్యాచ్‌‌‌‌ను లైవ్‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌ ప్రదర్శించి- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించింది. ఈ స్క్రీన్‌‌‌‌ను హీరోయిన్‌‌‌‌ శ్రియా శరణ్ ఆవిష్కరించింది.  

మూడు వేల మందికి పైగా ఈ మ్యాచ్‌‌‌‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా విరాళంగా అందించిన ఐదు వేల బ్యాట్‌‌‌‌లు, బంతులను ఇండియా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డికి శ్రియా శరణ్ అందించింది.  ఈ కార్యక్రమంలో పెర్నోడ్ రికార్డ్ ఇండియా తెలంగాణ, ఏపీ రీజియన్ హెడ్ అనంత్ స్వరూప్, తెలంగాణ ఏపీ మార్కెటింగ్ హెడ్ నవనీత్ రావు తదితరులు పాల్గొన్నారు.