భారత్ పాక్ మ్యాచ్ టికెట్స్ అమ్మకాలు షురూ..

భారత్ పాక్ మ్యాచ్ టికెట్స్ అమ్మకాలు షురూ..

క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. ఈ రెండు జట్ల మధ్య పోరు మినీ యుద్ధాన్ని తలపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో టీమిండియా పాక్తో తలపడబోతుంది. ఆసియా కప్ టీ20 టోర్నీ ఆగస్టు 27న ప్రారంభం కానుండగా..చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ఆగస్టు 28న జరగనుంది. దీంతో ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ మ్యాచ్ టికెట్ అమ్మకాలు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ట్విట్టర్లో ప్రకటించింది.  

ఆసియాకప్ టోర్నీ అన్ని మ్యాచుల టికెట్ల అమ్మకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి.ఏ మ్యాచులను వీక్షించాలనుకుంటున్నారో..ఆ మ్యాచుల టికెట్లను బుక్ చేసుకునేందుకు లింక్ ప్రెస్ చేయండి అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా platinumlist.net అనే లింక్ ను మెన్షన్ చేసింది. 

ఆసియా కప్ 2022లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లతో పాటు..మరో బెర్త్‌ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో తలపడతాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ 2022 జరగనుంది.  ఆసియా కప్ 2022 టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా...ఆర్థిక సంక్షోభం, ఇతర రాజకీయా కారణాలతో టోర్నీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ యూఏఈకి తరలించింది.