పాకిస్తాన్ దేశానికి పెద్ద విమానంలో చైనా యుద్ధ సామాగ్రి పంపిందా..!

పాకిస్తాన్ దేశానికి పెద్ద విమానంలో చైనా యుద్ధ సామాగ్రి పంపిందా..!

పహల్గాం దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు..పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు..అనుకున్న లక్ష్యాలను ఛేదించిన భారత్.. అయినా బుద్ధిమారని పాక్ సరిహద్దు వెంట దాడులు.. పాక్ కు ఎక్కడిదీ ధైర్యం..పాక్ దుశ్చర్యలకు వెనక ఎవరున్నారు? డౌట్స్ వ్యక్తమవుతున్న క్రమంలో పాకిస్తాన్ కు చైనా ఆయుధాలను సరఫరా చేసింది అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. నిజంగానే పాక్ కు చైనా ఆయుధం సాయం చేసిందా?..

గత వారం భారత్ పై దాడిక్రమంలో పాకిస్తాన్‌కు ఆయుధసామాగ్రితో కూడిన అతిపెద్ద సైనిక కార్గో విమానాన్ని పంపినట్లు వచ్చిన వార్తలు వచ్చాయి. మొదటినుంచి పాకిస్థాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో పాక్ కు ఆయుధాలు పంపింది అన్న  వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 

సోమవారం(మే12) దీనిపై చైనా సైన్యం  స్పందించింది. అవీ వట్టి పుకార్లే అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం కొట్టి పారేసింది. ఇది దురుద్దేశ పూర్వకంగా చేసిన ప్రచారం..దీని వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

చైనా, పాకిస్తాన్ ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాపై పలు అనుమానాలకు తావిచ్చింది. గతవారం భారత్ పై జరిగిన దాడుల్లో పాకిస్తాన్ చైనా యుద్ద విమానాలను ఉపయోగించిందని వార్తలు వ్యాపించాయి. అయితే బీజింగ్ ఆ వార్తలను తిరస్కరించింది. 

Y-20 కార్గో విమానం ద్వారా పాకిస్తాన్‌కు సహాయ సామాగ్రిని రవాణా చేస్తోంది అనే ఊహాగానాలను చైనా  తిప్పికొట్టింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక ప్రకటనలో వైమానిక దళం అటువంటి మిషన్ జరగలేదని స్పష్టం చేసింది. సైనిక సంబంధిత పుకార్లను తయారు చేసి వ్యాప్తి చేసే వారు చట్టబద్ధంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అని తెలిపింది.
 
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా మద్దతు ప్రకటించిన క్రమంలో చైనా సహాయం చేస్తుందనే పుకార్లకు ఇంధనంగా మారింది. అంతేకాదు.. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) కొత్త నివేదిక ప్రకారం.2020 నుంచి 2024 మధ్య పాకిస్తాన్ మొత్తం ఆయుధాల దిగుమతుల్లో చైనా 81శాతం వాటా కలిగి ఉంది. ఆయుధ సరఫరాలో చైనా,  పాకిస్తాన్‌కు ప్రాథమిక ఆయుధ సరఫరాదారుగా మారింది. 

ఈ క్రమంలో చైనా తనపై వస్తున్న ఆరోపణలపై తన అధికారిక వెబ్ సైట్ లో వివరణ ఇచ్చింది. ఉగ్రవాదంపై చైనా తన స్పషమైన వైఖరిని చెప్పింది. చైనా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఎటువంటి ఉగ్రవాదాన్ని అయిన సహించదు. శాంతి,స్థిరత్వం విస్తృత ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉండాలని ,  సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని రెండు దేశాలను కోరుతున్నామని చైనా నొక్కి చెప్పింది.