దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరుంటారంటే..?

దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరుంటారంటే..?

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత భారత్ పుంజుకుంది. 5 టీ20 ల సిరీస్ లో భాగంగా స్వదేశంలో కంగారులను 4-1తో చిత్తు చేసింది. ఇదే ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా సఫారీ గడ్డపై నేడు (డిసెంబర్ 10) తొలి టీ20 ఆడనుంది. డర్బన్ లోని కింగ్స్ మీడియా వేదికగా జరగనున్న ఈ టీ20 సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో ఎవరుంటారో ఇప్పుడు చూద్దాం.
 
కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు టీ20 సిరీస్ కు రెస్ట్ తీసుకోవడంతో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగితుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో రెస్ట్ తీసుకున్న గిల్, జడేజా, సిరాజ్ జట్టులో చేరడంతో తుది జట్టు విషయంలో ఎవరుంటారనే ఆసక్తి నెలకొంది. ఓపెనర్లు గా గైక్వాడ్, జైస్వాల్ అద్భుతమైన ఫామ్ లో ఉండగా కిషాన్ మూడో స్థానంలో అదరగొడుతున్నాడు. అయితే ఇప్పుడు గిల్ రావడంతో వీరి ముగ్గురిలో ఎవరు బెంచ్ కు పరిమితమవుతారో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. 

ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటే ఈ మ్యాచ్ లో గిల్ పై వేటు తప్పదు.లేకపోతే గైక్వాడ్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో సూర్య, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఆరోన్ స్థానంలో రింకూ సింగ్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆల్ రౌండర్ జడేజా రావడంతో 7 స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక ఏకైక స్పిన్నర్ గా బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్లుగా దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటారు. అయితే మరో పేసర్ కోసం ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. 

భారత్ తుది జట్టు అంచనా:

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్/ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్/ ముకేశ్ కుమార్, మహ్మద్ సిరాజ్.