తాలిబన్ ఎఫెక్ట్: అఫ్గాన్‌లో ఇండియన్ కాన్సులేట్ ఖాళీ

తాలిబన్ ఎఫెక్ట్: అఫ్గాన్‌లో ఇండియన్ కాన్సులేట్ ఖాళీ

కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ఇండియన్ కాన్సులేట్ బృందం తమ ఆఫీసును ఖాళీ చేసింది. కాందహార్‌‌కు దగ్గర్లో అఫ్గాన్ సైనికులు, తాలిబన్లకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా కాన్సులేట్‌ నుంచి 50 మంది అధికారులను ఖాళీ చేయించామని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ, అధికార ప్రతినిధి అరిందామ్ బాగ్చీ చెప్పారు. కాందహార్‌లో పరిస్థితులు చక్కబడే వరకు స్థానిక ఉద్యోగుల ద్వారా ఆపరేట్ చేస్తామని తెలిపారు. కాగా, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా తన దళాలను అఫ్గాన్ నుంచి వెనక్కి తరలించింది. దీంతో తాలిబన్‌లు అఫ్గాన్‌ను తమ చేతుల్లోకి తీసుకోవాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా గ్రామాలను ఆక్రమించిన తాలిబన్లు.. సరిహద్దుల్లో కూడా మూడింట రెండొంతుల సరిహద్దులను తమ అధీనంలో ఉండేలా ఆక్రమించారు.