పాకిస్తాన్ ఎలా చేసిందో.. ఇండియా అలాగే చేసింది : హై కమిషన్ ఆఫీసుల సెక్యూరిటీ గోడలు కూల్చివేత

పాకిస్తాన్ ఎలా చేసిందో.. ఇండియా అలాగే చేసింది : హై కమిషన్ ఆఫీసుల సెక్యూరిటీ గోడలు కూల్చివేత

పాకిస్తాన్ చర్యలకు భారత్  ప్రతిచర్యలు చేపట్టింది.. ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీసు భద్రతా వలయాన్ని తొలగించారు అధికారులు. న్యూఢిల్లీ చాణక్యపథ్ లోని పాకిస్తాన్ హై కమిషన్ వెలుపల అనధికారికంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారీకేడ్లు, భద్రతా వలయ నిర్మాణాలను  అధికారులు బుల్డోజర్లతో తొలగించారు.  మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్ లోని భారత్ హైకమిషన్  ఆఫీసుకు భద్రతపరమైన సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించిన  తర్వాత భారత అధికారులు ఈ చర్యలు చేపట్టారు. 

మరోవైపు జమ్మూకాశ్వీర్ అమెరికా వ్యాఖ్యలను పాకిస్తాన్ వ్యతిరేకించింది. జమ్మూకాశ్మీర్ లో మొదటిసారి పర్యటించిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ఆప్రాంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అంతర్భాగమైన జమ్మూకాశ్మీర్ సహజసిద్దంగా అందరమైన ప్రాంతం అని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం , సీఎం ఒమర్ అబ్దుల్లా చేపట్టిన అభివృద్ధి పనులు బాగా ఉన్నాయని అన్నారు.జమ్మూకాశ్మీర్ ప్రయాణంపై గతంలో అమెరికా చేసిన వ్యాఖ్యలను పునపరిశీలించుకోవచ్చని అన్నారు. 

గోర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్తాన్. కాశ్మీర్ వివాదంపై అమెరికా దీర్ఘకాలంగా అనుసరిస్తున్న వైఖరికి గోర్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని, అలాగే అంతర్జాతీయ చట్టం ,ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు వాషింగ్టన్ కట్టుబడి ఉంటామని చేసిన ప్రకటనకు అవి పొంతన లేనివని పాకిస్థాన్ పక్షం వాదించింది.