దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిని 24 గంటల్లో 17 వేల 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే నాలుగు వేలకు పైగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,62,294 కు చేరగా..4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు.  ఇక  దేశ వ్యాప్తంగా 88 వేల 284 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24గంటల్లో 13మంది మరణించగా 13,029 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 5 లక్షల 24 వేల 954 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉండగా..కేరళలో 3890, ఢిల్లీలో1934, తమిళనాడులో1063 కేసులు నమోదయ్యాయి. కాగా కేసులు పెరుగుతుండడంతో పాజిటివిటీ 4.32శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.