24 గంటల్లో 756 కరోనా కేసులు .. 889 మంది డిశ్చార్జ్‌

24 గంటల్లో 756 కరోనా కేసులు .. 889 మంది డిశ్చార్జ్‌

వరుసుగా మూడో రోజు దేశంలో 700కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 756 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో  ప్రస్తుతం దేశంలో 4వేల 49 యాక్టివ్ కేసులున్నాయి.  ఈ మేరకు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ రిలీజ్ చేసింది.  మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో ఐదుగురు చనిపోయారు.  

కేరళ, మహారాష్ట్రలలో రెండు మరణాలు నమోదు కాగా  జమ్మూ కశ్మీర్‌లో ఒక కేసు నమోదైంది. దీంతో మరణాల సంఖ్య 5,33,392 కు చేరుకుంది.  ఇక కోవిడ్ -19 నుండి 889 మంది కోలుకున్నారు.  మొత్తం యాక్టివ్ కేసులలో, వీటిలో ఎక్కువ భాగం (సుమారు 92 శాతం) హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు.   రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతూనే ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించాలని, శుభ్రత పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించిన వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరిస్తున్నారు.