లాన్‌‌ బౌల్స్‌‌లో కొత్త చరిత్ర

లాన్‌‌ బౌల్స్‌‌లో కొత్త చరిత్ర

ఇండియా లాన్‌‌ బౌల్స్‌‌ టీమ్‌‌  కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో తొలి పతకం ఖాయం చేసుకొని చరిత్ర సృష్టించింది. విమెన్స్‌‌ ఫోర్స్‌‌ ఈవెంట్‌‌లో ఇండియా ఫైనల్‌‌ చేరుకొని కనీసం సిల్వర్‌‌ ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో లవ్లీ చౌబే (లీడ్‌‌), పింకి, నయన్మోయి సైకియా, రూపా రాణి టర్కీతో కూడిన ఇండియా 16–13 తేడాతో న్యూజిలాండ్‌‌ జట్టును ఓడించి తొలిసారి ఫైనల్‌‌ చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో ఇండియా పోటీ పడనుంది. 

వెండికొండ సుశీల
వెయిట్‌‌ లిఫ్టర్లు వరుసగా ఆరు మెడల్స్‌‌ అందించిన తర్వాత  జూడోలో ఇండియాకు రెండు పతకాలు లభించాయి. స్టార్‌‌ జూడోకా ఎల్‌‌ సుశీలా దేవి సిల్వర్‌‌తో సత్తా చాటగా.. విజయ్‌‌ కుమార్‌‌ బ్రాంజ్‌‌తో మెప్పించాడు. సోమవారం  విమెన్స్‌‌ 45 కేజీ విభాగంలో  అద్భుత ఆటతో ఫైనల్‌‌కు దూసుకొచ్చి సుశీల గోల్డ్‌‌పై ఆశలు రేపింది. కానీ, 4.2 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో ‘వాజా–అరి’ ద్వారా  సౌతాఫ్రికాకు చెందిన మిచేలా వైట్‌‌బూయి చేతిలో పోరాడి ఓడి సిల్వర్‌‌తో సంతృప్తి చెందింది. కామన్వెల్త్‌‌లో ఆమెకిది రెండో సిల్వర్​ కావడం విశేషం. 2014 గ్లాస్గో గేమ్స్‌‌లోనూ తను సిల్వర్‌‌ నెగ్గింది. 27 ఏళ్ల దేవి  సెమీస్‌‌లో ‘ఇప్పోన్‌‌’తో మారిషస్‌‌కు చెందిన ప్రిసిల్లా మొరాండ్‌‌ను ఓడించి ఫైనల్‌‌ చేరుకుంది. ఇక, మెన్స్‌‌ 60 కేజీ కేటగిరీలో  విజయ్‌‌ బ్రాంజ్‌‌ సాధించాడు. తొలుత క్వార్టర్స్‌‌లోనే ఓడినప్పటికీ రెపిఛేజ్‌‌లో సత్తా చాటి బ్రాంజ్‌‌ మెడల్‌‌ బౌట్‌‌కు అర్హత సాధించాడు. ఇందులో విజయ్‌‌ 10–0 తేడాతో సైప్రస్‌‌కు చెందిన పెట్రోస్‌‌ను ఓడించి పతకం గెలిచాడు.