కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో చికిత తానిపర్తి-సాహిల్ జాదవ్ 158-157 తేడాతో జంగ్‌యూన్ పార్క్-చోయ్ యున్ గ్యు (కొరియా)లపై విజయం సాధించారు. దాంతో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోటాను సాధించిన తొలి దేశంగా ఇండియా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా సాహిల్, చికిత రెండు స్వర్ణాలతో మెరవడం విశేషం. మిక్స్‌డ్ ఫైనల్లో చికిత, సాహిల్ బలమైన ఆరంభాన్నిచ్చారు. వరుసగా పర్ఫెక్ట్ 10 స్కోర్లు సాధించి 40-39తో నిలిచారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యం మరో రెండు పాయింట్లు పెరిగింది.
కానీ చికిత ఒక షాట్‌లో 9 పాయింట్లే సాధించడంతో ఆధిక్యం ఒక పాయింట్‌కు తగ్గింది. మూడో రౌండ్ తర్వాత ఇండియా ద్వయం 118-117తో ముందంజ వేసింది. ఆ తర్వాత కొరియా జట్టు పర్ఫెక్ట్ టెన్ స్కోరు సాధించడంతో ఇండియాకు చివరి రెండు షాట్లలో పర్ఫెక్ట్ 10 స్కోర్లు అవసరమయ్యాయి. చికిత 9 స్కోరుతో తడబడినా.. సాహిల్ ఈజీగా లక్ష్యాన్ని ఛేదించడంతో మ్యాచ్ షూటాఫ్‌కు దారి తీసింది. షూటాఫ్‌లో చికిత, సాహిల్ ఇద్దరూ10 స్కోర్లు సాధించగా... పార్క్, చోయ్ కేవలం 9 స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది.
