
- 10 నెలల గరిష్టానికి సర్వీసెస్ సెక్టార్ పనితీరు
న్యూఢిల్లీ: జూన్ నెలలో భారతదేశ సేవల రంగం పది నెలల్లో ఎన్నడూ లేనంతగా విస్తరించింది.డిమాండ్ ,ధరల ఒత్తిళ్లు తగ్గడం దీనికి కారణం. కొత్త వ్యాపారం, పెరిగిన ఎగుమతి ఆర్డర్లు, ముఖ్యంగా ఆసియా, మిడిల్ ఈస్ట్,US మార్కెట్ల నుంచి సపోర్టుతో HSBC ఇండియా సర్వీసెస్ PMI 60.4కి చేరుకుంది. అయితే ఉద్యోగ సృష్టి కొనసాగినప్పటికీ రాబోయే సంవత్సరానికి వ్యాపార దృక్పథం బలహీనపడింది.
హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ సర్వే ప్రకారం.. ఈ ఏడాది మే నెలలో 58.8 గా రికార్డ్ అయిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), జూన్‌లో 60.4కి పెరిగింది. కొత్త ఆర్డర్లు, అంతర్జాతీయ విక్రయాలు, కొత్త ఉద్యోగాలు పెరిగాయి. పీఎంఐ 50 పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. సర్వీసెస్ సెక్టార్‌లో కొత్త ఆర్డర్లు కిందటేడాది ఆగస్టు తర్వాత అత్యంత వేగంగా గత నెలలోనే పెరిగాయి.
ఆసియా, మిడిల్ ఈస్ట్, యూఎస్ మార్కెట్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి. ఉద్యోగ కల్పన వరుసగా 37 వ నెలలోనూ ఊపందుకుంది. మే నాటి రికార్డు కంటే కాస్త తగ్గినా దీర్ఘకాల సగటు కంటే ఎక్కువగా ఉంది. కన్జూమర్ సర్వీసెస్ సెగ్మెంట్‌లో ఖర్చులు ఎక్కువగా ఉండగా, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌లో ఔట్‌పుట్ ఛార్జీలు వేగంగా పెరిగాయి.
వచ్చే ఏడాది వృద్ధిపై 18శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ ఔట్‌పుట్ ఇండెక్స్ ఈ ఏడాది మే నెలలోని 59.3 నుంచి జూన్‌లో 61కి పెరిగింది.