అథ్లెటిక్స్‌లో భారత్‌ జోరు.. 4x400 మీటర్ల రిలేలో మహిళల జట్టుకు స్వర్ణం

అథ్లెటిక్స్‌లో భారత్‌ జోరు.. 4x400 మీటర్ల రిలేలో మహిళల జట్టుకు స్వర్ణం

అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా అథ్లెట్ల పతకాల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 4x400 మీటర్ల రిలేలో ఇండియాకు గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌ లభించింది. ఫైనల్లో కిరణ్ పహల్‌‌‌‌‌‌‌‌–పూవమ్మ–ప్రాచి–విత్య రామ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా బృందం 3:29.69 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఏషియాడ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇదే తొలి బంగారు పతకం. బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌, చైనా వరుసగా సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాయి. మెన్స్‌‌‌‌‌‌‌‌ 4x400 మీటర్ల రిలేలో ధరంవీర్‌‌‌‌‌‌‌‌ చౌదరి–మను తెక్కినలిల్‌‌‌‌‌‌‌‌–జై కుమార్‌‌‌‌‌‌‌‌–విశాల్‌‌‌‌‌‌‌‌ తెన్నరసుల బృందం 3:01.61 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో మూడో స్థానంతో కాంస్యాన్ని గెలిచింది. జపాన్‌‌‌‌‌‌‌‌, ఖతార్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌–2 ప్లేస్‌‌‌‌‌‌‌‌లను సాధించాయి. విమెన్స్‌‌‌‌‌‌‌‌ హై జంప్‌‌‌‌‌‌‌‌లో పూజా సింగ్‌‌‌‌‌‌‌‌ 1.84 మీటర్ల ఎత్తును అధిరోహించి కాంస్యంతో మెరిసింది. అయితే వ్యక్తిగత రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయింది. 4x100 మీటర్ల మిక్స్‌‌‌‌‌‌‌‌డ్ రిలేలో గురిందర్‌‌‌‌‌‌‌‌వీర్ సింగ్‌‌‌‌‌‌‌‌–అనిమేష్‌‌‌‌‌‌‌‌ కుజుర్‌‌‌‌‌‌‌‌–స్నేహా సత్యనారాయణ–హరిత భాద్రాతో కూడిన ఇండియా జట్టు 41.06 సెకన్ల సమయంతో మూడవ స్థానంలో నిలిచి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకుంది. 

నరేందర్‌‌‌‌‌‌‌‌కు కాంస్యం

ఏషియాడ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బాక్సర్ల పంచ్‌‌‌‌‌‌‌‌ అదిరింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ 90 కేజీల్లో నరేందర్‌‌‌‌‌‌‌‌ బెర్వాల్‌‌‌‌‌‌‌‌ కాంస్యంతో మెరవగా, అంకుష్‌‌‌‌‌‌‌‌ పంగల్‌‌‌‌‌‌‌‌, పర్వీన్‌‌‌‌‌‌‌‌ హుడా ఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలను ఖాయం చేశారు. 90 కేజీ సెమీస్‌‌‌‌‌‌‌‌లో నరేందర్‌‌‌‌‌‌‌‌ 0–5తో ఐబెక్‌‌‌‌‌‌‌‌ ఓరల్‌‌‌‌‌‌‌‌బే (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 65 కేజీ సెమీస్‌‌‌‌‌‌‌‌లో పర్వీన్‌‌‌‌‌‌‌‌ 5–0తో లీ షు (చైనా)పై, 80 కేజీల్లో అంకుష్‌‌‌‌‌‌‌‌ 4–1తో ఫజ్లిద్దీన్‌‌‌‌‌‌‌‌ ఎర్కిన్‌‌‌‌‌‌‌‌బోయెవ్‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. దాంతో ఆసియా క్రీడల్లో ఎనిమిదేళ్ల తర్వాత ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరిన తొలి ఇండియన్​ మెన్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌గా పంగల్‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కాడు. 

సెమీస్‌‌‌‌‌‌‌‌లో కనోయ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు

ఆసియా క్రీడల్లో ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌ కయాక్‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌లో కనో ప్లేయర్లు సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ కయాక్‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌‌‌‌‌ హీట్స్‌‌‌‌‌‌‌‌లో హితేష్‌‌‌‌‌‌‌‌ కేవత్‌‌‌‌‌‌‌‌ 118.22 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో ఎనిమిదో స్థానంలో నిలవగా, ప్రద్యుమ్న సింగ్ రాథోడ్ 127.70 సెకన్లతో పదో  స్థానంలో నిలిచాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ కనో సింగిల్ హీట్స్‌‌‌‌‌‌‌‌లో పల్లవి జగ్‌‌‌‌‌‌‌‌తాప్ 224.20 సెకన్ల సమయంతో  ఏడో స్థానంలో, రీనా సేన్ 342.72 సెకన్లతో తొమ్మిదో  స్థానంలో నిలిచారు. విమెన్‌‌‌‌‌‌‌‌ కయాక్ సింగిల్ విభాగంలో శిఖా చౌహాన్ హీట్స్‌‌‌‌‌‌‌‌లో 344.87 సెకన్ల సమయంతో చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచారు. ఏషియాడ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా వాలీబాల్‌‌‌‌‌‌‌‌ జట్టు క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 3–2తో ఖతార్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. రెండు సెట్లు వెనకబడినా.. అద్భుతంగా పుంజుకున్న ఇండియా 2 గంటల 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను విజయంతో ముగించింది.