తుది పోరుకు సింధు

తుది పోరుకు సింధు

కౌలాలంపూర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు.. మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింధు 13–21, 21–16, 21–12తో బుసానన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది.  బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్ల సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో  సింధుకు ఇది 453వ విజయం కావడం విశేషం. అత్యధిక సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయాలు సాధించిన ఇండియా షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సైనా (451)ను అధిగమించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు రెండోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి యి (చైనా)తో తలపడుతుంది.