
పాకిస్తాన్ కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. రవి నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఆ నీటిని పూర్తిగా భారత్ వినియోగించేందుకు ప్రణాలిక సిద్ధం చేసింది.రావి నదిపై షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసింది. ఆ నీటిని జమ్ము కశ్మీర్ లోని కథువా, సాంబా జిల్లాల్లో సాగునీరుగా మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1150 క్యూసెక్కుల నీరుని ఈ ప్రాంతాలకు అందనున్నట్టు తెలిపింది. 32 వేల హెక్టార్ల భూమికి సాగు నీరుగా అందనుంది. భారత్-పాక్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రిటీ ప్రకారం.. భారత్ ఇప్పుడు రవి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోనుంది.
గతంలో పాత లఖన్‌పూర్ డ్యామ్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించే నీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రజలకు ఉపయోగపడనున్నాయి. దీంతో జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ కు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. రవి నది నీటిని భారత్ వినియోగించుకోవడంతో పాక్ లోని కొన్ని ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బందులు తలెత్తనున్నట్టు ఇరిగేషన్ నిపుణులు తెలిపారు.
పీవీ పునాదీ.. మోదీ ఓపెనింగ్
షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్ట్‌కు 1995లో మాజీ ప్రధాని PV నర్సింహారావు పునాది రాయి వేశారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విబేధాల కారణంగా చాలా కాలం అడ్డంకులు ఎదుర్కొంది. పీఎం మోదీ కలగ చేసుకుని ప్రాజెక్టు పనులు పున:ప్రారంభం అయ్యేందుకు కృషి చేశారు. రూ. 3300 కోట్లతో కట్టిన ఈ ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నట్టు సమాచారం.