గ్లోబల్ మార్కెట్లో.. మనమే నమ్మకమైన సెమీకండక్టర్ సప్లయర్: ప్రధాని మోదీ

గ్లోబల్ మార్కెట్లో..  మనమే నమ్మకమైన సెమీకండక్టర్ సప్లయర్: ప్రధాని మోదీ
  • రూ. 9 లక్షల కోట్ల మార్కెట్ దిశగా దేశ సెమీకండక్టర్ రంగం
  • గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేన్స్ సెమీకాన్ ప్లాంట్ ప్రారంభం

న్యూఢిల్లీ: యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సప్లయ్ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దెబ్బతిన్నా..మన దేశం మాత్రం ఒక నమ్మకమైన సెమీకండక్టర్ సరఫరాదారుగా నిలుస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో టెక్నాలజీ, ఎనర్జీ సెక్యూరిటీ కోసం భవిష్యత్తుల్లో బలమైన పునాది వేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేన్స్ సెమీకాన్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్స్డ్ సెమీకండక్టర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

అనంతరం మోదీ మాట్లాడుతూ.. "ప్రపంచ మార్కెట్లో సప్ల చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ మన దేశం ఒక నమ్మకమైన సెమీకండక్టర్ సరఫరాదారుగా అవతరిస్తోంది. ఈ రోజు సానంద్, సిలికాన్ వ్యాలీ మధ్య ఒక కొత్త వంతెన ఏర్పడింది. సానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ ఇప్పుడు కాలిఫోర్నియాలోని కంపెనీలకు 'ఇంటెలిజెంట్ పవర్ మోడ్యూల్స్' సరఫరా చేస్తున్నది. 

సెమీకండక్టర్లు, ఏఐ, అరుదైన ఖనిజాల సరఫరాలో స్వయం సమృద్ధి సాధించేందుకు అమెరికా నేతృత్వంలోని 'ప్యాక్స్ సిలికా' కూటమిలో భారత్ చేరింది. ఖనిజాల రీసైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించేందుకు రూ. 1,500 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రవేశపెట్టాం. ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళ వంటి తీరప్రాంత రాష్ట్రాలను కలుపుతూ 'రేర్ ఎర్త్ కారిడార్' ఏర్పాటు చేస్తాం"  అని వివరించారు.

ఈ దశాబ్దం భారత్​కు 'టెకేడ్'

2021 నుంచి 2030 వరకు ఉన్న పదేండ్ల కాలాన్ని భారతదేశపు 'టెకేడ్(టెక్నాలజీ దశాబ్దం)'గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘భారత్ కేవలం మార్పును చూసే సాక్షిగా మాత్రమే కాదు. ఆ మార్పుకు నాయకత్వం వహించే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఏఐలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. 2021లో ప్రారంభమైన సెమీకండక్టర్ మిషన్ కింద 10 రాష్ట్రాల్లో రూ. 1.60 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. 

సెమీకండక్టర్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 'సెమీకండక్టర్ మిషన్ 2'ను కూడా ప్రారంభించాం. త్వరలోనే దేశంలో 85 వేల మంది డిజైన్ నిపుణులు తయారవుతారు. చిప్స్- టు- స్టార్టప్ ప్రోగ్రామ్ ద్వారా 400 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అధునాతన డిజైన్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉంది. ఇది త్వరలోనే రూ. 9 లక్షల కోట్లను దాటుతుంది. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మెజారిటీ వాటాను దేశీయంగానే తయారు చేయడమే మా లక్ష్యం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.