ఆసిస్ దుమ్ముదులిపిన భారత్: సిరీస్ కైవసం

ఆసిస్ దుమ్ముదులిపిన భారత్: సిరీస్ కైవసం

సిడ్నీ: 3టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ టీ20లో భారత్ గ్రేట్ విక్టరీ సాధించింది. 195 టార్గెట్ ను మరో 6 వికెట్లు ఉండగానే గెలిచి, ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటింది.  ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ప్రారంభాన్ని ఇవ్వడంతో ఆ తర్వాత వచ్చిన కింగ్ కోహ్లీ చెలరేగడంతో సిడ్నీ స్టేడియంలో పరుగుల వరద పారింది.

కోహ్లీ ఔట్ అయినప్పటికీ భారత యువ ప్లేయర్లు ఆర్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యార్ చివర్లో సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి చివరి వరకు నువ్వా నేనా అనేలా సాగిన మ్యాచ్ ను మరో 3 బాల్స ఉండగానే ఫిన్ చేశారు. చివరి ఓవర్ లో 14 రన్స్ అవసరంగానే పాండ్యా 2 వరుస సిక్సర్లతో భారత్ కు విజయాన్ని కన్ఫమ్ చేశాడు. దీంతో 3టీ20ల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.

భారత్ స్కోర్ :  శిఖర్‌ ధావన్‌(52: 36 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు), కోహ్లీ(40: 24 బంతుల్లో 2ఫోర్లు,2సిక్సర్లు) ,కేఎల్‌ రాహుల్‌(30 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌) , హార్దిక్‌ పాండ్య(42 నాటౌట్:‌ 22 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌: 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌)