బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను భారత్  విజయవంతంగా ప్రయోగించింది. ఐఏఎఫ్ కు చెందిన ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్... బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో తాకిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ సందర్భంగా డీఆర్డీవో సైంటిస్టులను పలువరు అభినందించారు. గతంలో బ్రహ్మోస్ మిస్సైల్‌ రేంజ్‌ 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిలోమీటర్లకు పెంచారు.తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజ్‌ను మరింత అభివృద్ధి చేశారు. రేంజ్‌ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగంతో భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్థ్యం భారత వాయుసేన సొంతమైంది.


మరిన్ని వార్తల కోసం...

బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

శ్రీలంకలో సెల్ఫీ పాయింట్లుగా తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లు