భారత క్షిపణి పరీక్ష విజయవంతం

భారత క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ శాఖ మరో విజయం సాధించింది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ‘ప్రళయ్’ అత్యంత కచ్చితత్వం (హై డిగ్రీ)తో లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. ప్రళయ్ లో ని అన్ని సాంకేతిక వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ఈ షార్ట్ రేంజ్ గైడెడ్ మిస్సైల్ 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తాకగలదు. ‘ప్రళయ్’ పరీక్ష నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. ట్రాకింగ్ సాధనాల బ్యాటరీ తీర రేఖ వెంబడి దాని రూట్‌ని  పర్యవేక్షించారు. ఈ తొలి డెవలప్‌మెంట్ ఫ్లైట్ ట్రయల్ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO దాని అనుబంధ బృందాలను అభినందించారు. ఆధునిక ఉపరితలం నుండి ఉపరితల క్షిపణిని వేగంగా అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు DRDOను ఆయన అభినందించారు.

ఇవి కూడా చదవండి:

236కు చేరిన ఒమిక్రాన్ కేసులు

పడుకొని కోర్టుకు​ మాజీ డీజీపీ.. జడ్జి ఫైర్