
పెరుగియా (ఇటలీ) : ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ పెరుగియా చాలెంజర్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ నగాల్ 6–4, 7–5తో అన్‌సీడెడెడ్ మాక్స్ కస్నికోవ్‌స్కి (పోలాండ్)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీస్‌లో స్పెయిన్‌కు చెందిన బెర్నపె మిరాలెస్‌తో పోటీపడనున్నాడు.