యూఎస్, వెనెజువెలా దేశాల నుంచి.. మరింత ఆయిల్ కొనండి

యూఎస్, వెనెజువెలా దేశాల నుంచి.. మరింత ఆయిల్ కొనండి
  • ప్రభుత్వ రిఫైనరీలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ:అమెరికా, వెనెజువెలా నుంచి  క్రూడాయిల్‌‌‌‌ కొనుగోళ్లను పెంచాలని  ప్రభుత్వ రిఫైనరీలకు  కేంద్రం సూచించింది. ‘‘అమెరికాతో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో  భాగంగా ఎనర్జీ కొనుగోళ్లను పెంచాలని ఇండియా చూస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోనుంది.  రిఫైనరీలు స్పాట్ మార్కెట్ టెండర్లలో యూఎస్‌‌‌‌ గ్రేడ్స్‌‌‌‌కి ప్రాధాన్యం ఇవ్వాలని, వెనెజువెలా ఆయిల్ మాత్రం ట్రేడర్లతో ప్రైవేట్ చర్చల ద్వారా కొనుగోలు చేయాలని   సూచించింది” అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  

అయితే, అమెరికా క్రూడ్ ఎక్కువగా లైట్, స్వీట్ గ్రేడ్స్ కావడంతో భారత రిఫైనరీలకు పూర్తిగా అనుకూలం కాదు.  షిప్పింగ్  రేట్లు ఎక్కువగా ఉండడంతో  అమెరికా నుంచి ఎక్కువ పరిమాణంలో ఆయిల్ దిగుమతి చేయడం ఖర్చుతో కూడుకున్నది. దీనికి బదులుగా వెస్ట్ ఆఫ్రికా, కజకిస్తాన్ నుంచి తక్కువ ఖర్చుతో ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.  2025లో ఇండియా రోజుకు సగటున 3 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకుంది. వెనెజువెలా నుంచి ఐఓసీ, బీపీసీఎల్‌‌‌‌, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌ కలిపి ఇటీవల 40 లక్షల బ్యారెల్స్ ఆయిల్ కొనుగోలు చేశాయి.