
పారిస్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండియాకు రానుంది. 2026 ఆగస్టులో జరగనున్న ఈ టోర్నమెంట్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. గతంలో 2009లో హైదరాబాద్ వేదికగా ఈ టోర్నమెంట్‌ను తొలిసారిగా ఇండియా నిర్వహించింది. పారిస్‌లో జరిగిన తాజా ఎడిషన్ ముగింపు వేడుకలో ఈ అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ పారిస్‌లో కనిపించిన ఉన్నత ప్రమాణాలను ఇండియా కూడా కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.