
ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా తొలి రోజు తొలి సెషన్ లో ఆధిపత్యం చూపించింది. ఇంగ్లాండ్ పరుగులు రాబట్టడంలో తడబడి రెండు వికెట్లను కోల్పోయింది. మరోవైపు భారత బౌలర్లు తొలి సెషన్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పెషలిస్ట్ సీమర్లకు వికెట్లు పడకపోయినా.. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడంతో తొలి సెషన్ లో ఇంగ్లాండ్ 2 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (24), పోప్ (12) ఉన్నారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డికి రెండు వికెట్లు దక్కాయి.
ఇంగ్లాండ్ ఆచితూచి.. నితీష్ అదరహో:
పిచ్ స్వింగ్ కు అనుకూలించడంతో తొలి గంటలో ఇంగ్లాండ్ ఓపెనర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. బుమ్రా, ఆకాష్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. దీంతో 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఈ దశలో టీమిండియాకు నితీష్ బ్రేక్ ఇచ్చాడు. 13 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) ను ఔట్ చేసి భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు. నితీష్ వేసిన వైడ్ డెలివరీకి డకెట్ మోసపోయాడు. లెగ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ క్రాలీ (19) ని సూపర్ డెలివరీతో ఔట్ చేశాడు.
బంతి పిచ్ ఇన్ లైన్ మీద పడి అనూహ్యంగా స్వింగ్ ఇన్ స్వింగ్ అయింది. క్రాలీ బంతిని అంచనా వేసేలోపే బ్యాట్ ఎడ్జ్ కు బాల్ తగిలి వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ వెళ్ళింది. దీంతో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి తొలి సెషన్ లో కాస్త వెనకపడింది. ఈ దశలో ఇంగ్లాండ్ ను రూట్ పోప్ ఆదుకున్నారు. మూడో వికెట్ కు అజేయంగా 40 పరుగులు జోడించి లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రూట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినా.. పోప్ పూర్తిగా డిఫెన్సివ్ కే పరిమితమయ్యాడు.
Root and Pope go steady through to lunch after NKR's double-wicket over to remove England's openers ✌️
— ESPNcricinfo (@ESPNcricinfo) July 10, 2025
Ball-by-ball: https://t.co/dp3RtHo2QM pic.twitter.com/tNrmc4jkSf