IND vs ENG 2025: రాహుల్, పంత్ భారీ భాగస్వామ్యం.. రసవత్తరంగా లార్డ్స్ టెస్ట్

IND vs ENG 2025: రాహుల్, పంత్ భారీ భాగస్వామ్యం.. రసవత్తరంగా లార్డ్స్ టెస్ట్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. రాహుల్ సెంచరీకి తోడు పంత్ హాఫ్ సెంచరీతో గిల్ సేన ఇంగ్లాండ్ పై మూడో రోజు తొలి సెషన్ లో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు లంచ్ సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రాహుల్ (99) క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, ఆర్చర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. రనౌట్ రూపంలో పంత్ 74 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 139 పరుగులు వెనకబడి ఉంది.

ALSO READ | Pat Cummins: అప్పటివరకు వైట్ బాల్ సిరీస్ ఆడను.. క్రికెట్‌కు కమ్మిన్స్ షార్ట్ బ్రేక్

3 వికెట్ నష్టానికి 145 పరుగులతో మూడో రోజు తొలి సెషన్ ప్రారంభించిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంది. తొలి ఓవర్ లోనే రెండు ఫోర్లు కొట్టి పంత్ దూకుడు చూపించాడు. మరో ఎండ్ లో రాహుల్ తన క్లాసికల్ షాట్స్ తో అలరించాడు. ఇద్దరూ ఓ వైపు ఎటాకింగ్ చేస్తూనే మరోవైపు జాగ్రత్తగా ఆడడంతో టీమిండియా స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో పంత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. లంచ్ కు ముందు చివరి ఓవర్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. 

పంత్ రిస్కీ సింగిల్ తీసే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ కొట్టిన ఒక అద్భుతమైన త్రో కారణంగా రనౌటయ్యాడు. దీంతో టీమిండియా ఈ సెషన్ లో వికెట్ కోల్పోయింది. దీంతో రాహుల్, పంత్ మధ్య 148 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఓవరాల్ గా మూడో రోజు తొలి సెషన్ లో ఇండియా 103 పరుగులు జోడించి ఒక వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 112.3 ఓవర్లలో 387 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జో రూట్ (104) సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రైడన్ కార్స్‌‌‌‌ (56), జేమీ స్మిత్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీశాడు.