
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. జడేజా, నితీష్ కుమార్ రెడ్డి పట్టుదలగా ఆడడంతో రెండో మూడో రోజు రెండో సెషన్ లో టీమిండియా ఆధిపత్యం చూపించింది. టీ విరామ సమయం తర్వాత తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (44), సుందర్ (0). ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 61 పరుగులు వెనకబడి ఉంది. జడేజా, సుందర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పితే టీమిండియాకు ఆధిక్యం గ్యారంటీ.
ALSO READ | IND vs ENG 2025: సెంచరీకి ముందు ప్రయోగాలు అవసరమా.. రాహుల్ స్వార్ధానికి బలైన పంత్
4 వికెట్ల నష్టానికి 248 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ప్రారంభంలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్ లో సింగిల్ తో సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ తర్వాత తాను ఎదుర్కొన బంతికే బషీర్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో జడేజా, నితీష్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. జాగ్రత్తగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామం వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. టీ తర్వాత టీమిండియాకు స్టోక్స్ షాక్ ఇచ్చాడు. ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో నితీష్ (29)ను వెనక్కి పంపాడు. దీంతో ఆరో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
3 వికెట్ నష్టానికి 145 పరుగులతో మూడో రోజు తొలి సెషన్ ప్రారంభించిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలో పంత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. లంచ్ కు ముందు చివరి ఓవర్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పంత్ రిస్కీ సింగిల్ తీసే ప్రయత్నంలో బెన్ స్టోక్స్ కొట్టిన ఒక అద్భుతమైన త్రో కారణంగా రనౌటయ్యాడు. దీంతో రాహుల్, పంత్ మధ్య 148 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 రన్స్‌కు ఆలౌటైంది. జో రూట్ (104) సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రైడన్ కార్స్ (56), జేమీ స్మిత్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీశాడు.
Ravindra Jadeja 🤝 Nitish Kumar Reddy
— BCCI (@BCCI) July 12, 2025
A vital half-century stand between the two as #TeamIndia move past 300 👌
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#ENGvIND | @imjadeja | @NKReddy07 pic.twitter.com/mwP4Vn9yQd