IND vs ENG 2025: సెంచరీకి ముందు ప్రయోగాలు అవసరమా.. రాహుల్ స్వార్ధానికి బలైన పంత్

IND vs ENG 2025: సెంచరీకి ముందు ప్రయోగాలు అవసరమా.. రాహుల్ స్వార్ధానికి బలైన పంత్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతుంది. మొదట బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చూపించింది. ముఖ్యంగా ఓపెనర్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భారీ భాగస్వామ్యం జట్టును నిలబెట్టింది. మూడో రోజు లంచ్ సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రాహుల్ (99) క్రీజ్ లో ఉన్నారు. మూడో రోజు వీరి పట్టుదలతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఖాయమన్న దశలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రనౌట్ రూపంలో పంత్ ఔట్ కావడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

రాహుల్ సెంచరీ కోసం పంత్ తన వికెట్ కు రిస్కీలో పెట్టడం షాకింగ్ గా మారుతుంది. మూడో రోజు లంచ్ కు ముందు చివరి ఓవర్ బషీర్ వేస్తున్నాడు. 97 పరుగుల వద్ద ఉన్న రాహుల్ కవర్స్ లో సింగిల్ తీసి 98 పరుగులకు చేరుకున్నాడు. ఈ సమయంలో రాహుల్ రెండు పరుగులకు కాల్ చేసినా పంత్ నిరాకరించాడు. ఆ తర్వాత రాహుల్ కు సింగిల్ ఇద్దామనే ఆలోచనలో పంత్ గందరగోళానికి గురయ్యాడు. బషీర్ బౌలింగ్ లో బంతిని చిన్నగా పుష్ చేసి సింగిల్ తీద్దామని ప్రయత్నించాడు. అదే సమయంలో స్టోక్స్ వేగంగా ముందుకు వెళ్లి అంతలోనే వెనక్కి తిరిగి వికెట్లకు డైరెక్ట్ త్రో విసిరాడు. 

►ALSO READ | IND vs ENG 2025: సిరీస్‌లో రెండోది.. ఇంగ్లాండ్‌లో నాలుగోది

రీప్లేలో పంత్ ఔటైని తేలింది. దీంతో అప్పటివరకు జాగ్రత్తగా ఆడుతున్న పంత్ రనౌట్ (74) కారణంగా రాహుల్ కోసం ఔటయ్యాడు. ఈ వికెట్ ఇంగ్లాండ్ జట్టులో ఫుల్ జోష్ నింపింది. రాహుల్ తొలి సెషన్ లోనే సెంచరీ చేసుకోవాలనే ఆరాటంలో పంత్ పై ఒత్తిడి కలిగించి అతడిని ఔట్ చేసినట్టు అర్ధమవుతుంది. దీంతో రాహుల్, పంత్ మధ్య 148 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఓవరాల్ గా మూడో రోజు తొలి సెషన్ లో ఇండియా 103 పరుగులు జోడించి ఒక వికెట్ కోల్పోయింది.