కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ విజయం సాధించిన భారత్‌ అండర్‌-19

కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ విజయం సాధించిన భారత్‌ అండర్‌-19

రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపిన ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19 జట్టు.. ఆస్ట్రేలియా అండర్‌‌‌‌‌‌‌‌–19 టీమ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన తొలి యూత్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 48 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో విజయం సాధించారు. లక్ష్య రైచందానీ (240) భారీ డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీతో 430/8 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 102.3 ఓవర్లలో 494 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

లక్ష్య, మోహిత్‌‌‌‌‌‌‌‌ ఉల్వా (92) కలిసి తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 180 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. దాంతో ఇండియాకు 270 రన్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. కేసీ బార్టన్‌‌‌‌‌‌‌‌ 3, థియో సింగోస్‌‌‌‌‌‌‌‌, స్పెన్సర్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌, కానర్‌‌‌‌‌‌‌‌ గ్రెగరి తలా రెండేసి వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 59.4 ఓవర్లలో 229 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. బ్లేక్‌‌‌‌‌‌‌‌ కాటిల్‌‌‌‌‌‌‌‌ (123), నీల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (41), కానర్‌‌‌‌‌‌‌‌ గ్రెగరి (36) రాణించినా ప్రయోజనం దక్కలేదు. యశబర్దన్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ 6, ఇషాన్‌‌‌‌‌‌‌‌ ఓమ్‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో యూత్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 5 నుంచి జరుగుతుంది.