
చెమ్స్‌ఫోర్డ్: ఇంగ్లండ్ అండర్19 జట్టుతో రెండో యూత్ వన్డేలో ఇండియా యంగ్‌స్టర్ విహాన్ మల్హోత్రా (120) సెంచరీతో సత్తా చాటాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (80) కూడా రాణించినా ఇండియా అండర్19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కించుకోలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 51/1తో మూడో రోజు మంగళవారం ఆట కొనసాగించిన ఇండియా 58.1 ఓవర్లలో 279 రన్స్‌కే ఆలౌటైంది. విహాన్, ఆయుష్ తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఇంగ్లిష్ టీమ్ బౌలర్లలో రాల్పీ అల్బర్ట్ ఆరు వికెట్లతో దెబ్బకొట్టి ఆతిథ్య జట్టుకు 30 రన్స్ ఆధిక్యం అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఇంగ్లండ్ మూడో రోజు చివరకు 93/0 స్కోరుతో నిలిచింది. ఓవరాల్‌గా 123 రన్స్ ఆధిక్యంలో ఉంది.