ఇండియా–అమెరికా వాణిజ్యం భారీగా పెరుగుతోంది

 ఇండియా–అమెరికా వాణిజ్యం భారీగా పెరుగుతోంది

అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి

హైదరాబాద్​, వెలుగు: ఇండియా, అమెరికా మధ్య వ్యాపారం విపరీతంగా పెరుగుతోందని ఇండియాలో అమెరికా అంబాసిడర్​ ఎరిక్​ గార్సెట్టి అన్నారు. ఇందుకు రెండు దేశాలు తీసుకున్న చొరవ కారణమని అన్నారు. టీ–హబ్​లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇండియా ఎకానమీ అద్భుతంగా ఎదుగుతోంది. హైదరాబాద్​ సాధించిన ప్రగతి ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు మన దేశాల మధ్య వ్యాపారం దాదాపు సున్నాగా ఉండేది.

అమెరికా గత ఏడాది ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల బిజినెస్​ విలువ 191 బిలియన్​ డాలర్లు దాటింది. మా దేశంలో రెండు లక్షల మంది భారతీయ స్టూడెంట్లు చదువుతున్నారు. త్వరలో జరగబోయే మోడీ‌‌‌‌–బైడెన్​ భేటీలో వాణిజ్యంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. టీ–హబ్​ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్​. ఐడియాలను ఇది బిజినెస్​లుగా మార్చుతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తోంది”అని ఆయన వివరించారు.