ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా... ఆసియా గేమ్స్ సెమీస్‌‌‌‌‌‌‌‌ లో ఇండియా 

ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా... ఆసియా గేమ్స్ సెమీస్‌‌‌‌‌‌‌‌ లో ఇండియా 

నగోయా: ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కూడా ఆడకుండానే ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ జట్టు.. ఆసియా క్రీడల్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో సోమవారం జరగాల్సిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ వర్షం వల్ల రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ మొత్తం చిత్తడిగా మారింది. దాంతో ఒక్క బాల్‌‌‌‌‌‌‌‌ కూడా సాధ్యపడలేదు. 

గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అయిన ఇండియా ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 10వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉంది. దాంతో ఇండియాకు సెమీస్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ ఖాయమైంది. నగోయాలో గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తోంది. ఫలితంగా ఓవర్లు కుదించే చాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా లేకుండా పోయింది.