ఇటు కెప్టెన్‌‌‌‌.. అటు వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కుమ్మేసిన్రు

ఇటు కెప్టెన్‌‌‌‌.. అటు వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కుమ్మేసిన్రు

కూలిడ్జ్‌‌‌‌‌‌‌‌ (ఆంటిగ్వా):  మొదటి 25 ఓవర్లలో 86 రన్స్‌‌‌‌.. తర్వాతి 25 ఓవర్లో 204 ... లాస్ట్ పది ఓవర్లలో 108... ఆఖరి ఆరు బాల్స్​లోనే  27 రన్స్‌‌‌‌..! అండర్‌‌‌‌19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా బుధవారం  ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఇండియా బ్యాటర్ల పెర్ఫామెన్స్‌‌‌‌ ఇది. స్టార్టింగ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ ప్లేయర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌‌‌‌ చేసినా.. సగం ఓవర్లదాకా కంగారు పెట్టినా.. చివరకు ఇండియాదే పైచేయి అయింది..!  కుర్రాళ్లే అయినా మనోళ్లు సీనియర్లను తలదన్నే రీతిలో సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేశారు. కెప్టెన్‌‌‌‌ యశ్‌‌‌‌ ధూల్‌‌‌‌ (110 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 110) సెంచరీ కొట్టగా, వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌, ఆంధ్ర కుర్రాడు షేక్‌‌‌‌ రషీద్‌‌‌‌ (108 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 94) కొద్దిలో సెంచరీ మిస్సయినా అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. ఈ ఇద్దరూ థర్డ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 204 రన్స్‌‌‌‌ జోడించారు.  దాంతో, ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో 290/5 స్కోరు చేసి ఆసీస్‌‌‌‌కు మంచి టార్గెట్‌‌‌‌ ఇచ్చింది. లాస్ట్‌‌‌‌లో దినేశ్‌‌‌‌ బనా (4 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 నాటౌట్‌‌‌‌) మెరుపులు మెరిపించాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌కు వచ్చిన ఆసీస్‌‌‌‌  కడపటి సమాచారం అందే టైమ్‌‌‌‌కు    26  ఓవర్లలో 102/5 స్కోరుతో కష్టాల్లో పడ్డది. 

వైలీ(1), కెప్టెన్​ కూపర్​ (3), నివేథన్​ (11) ఫెయిలవగా,   కెలావె ( 30), కోరే మిల్లర్​ (38) కాసేపు పోరాడారు. అయితే, వెంటవెంటనే వికెట్లు పడగొట్టిన ఇండియా బౌలర్లు విక్టరీకి రూట్​ క్లియర్​ చేసుకున్నారు. నిషాంత్​ రెండు వికెట్లు తీశాడు.

యశ్​, రషీద్​ నిలబడ్డరు..

ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ను నిలబెట్టింది  కెప్టెన్‌‌‌‌ యశ్‌‌‌‌, వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రషీద్‌‌‌‌లే. ఇద్దరూ సూపర్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో టీమ్‌‌‌‌కు మంచి స్కోరు అందించారు.  టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియాకు స్టార్టింగ్‌‌‌‌లోనే షాక్‌‌‌‌ తగిలింది. ఫుల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్లు ఆంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ రఘువన్షి (6), హర్నూర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (16) ఇద్దరూ ఫెయిలయ్యారు. రఘువన్షిని ఎనిమిదో ఓవర్లో సాల్జ్‌‌‌‌మన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయగా, 13వ ఓవర్లో నిస్బెట్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌బాల్‌‌‌‌ను పుల్‌‌‌‌ చేసిన హర్నూర్‌‌‌‌ కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు.  దాంతో, 37 రన్స్‌‌‌‌కే రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా డిఫెన్స్‌‌‌‌లో పడ్డది. ఈ టైమ్‌‌‌‌లో రషీద్‌‌‌‌, యశ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను నడిపించే బాధ్యత తీసుకున్నారు.  ఆసీస్‌‌‌‌ పేసర్లు పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేస్తుండటంతో ఇద్దరూ ఆచితూచి బ్యాటింగ్‌‌‌‌ చేశారు. దాంతో, 28 ఓవర్లకు గానీ వంద దాటలేదు. అయితే, క్రీజులో కుదురుకున్న తర్వాత యశ్‌‌‌‌ బ్యాట్‌‌‌‌కు పని చెప్పాడు. స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేస్తూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు.  విట్నీ వేసిన 31వ ఓవర్లో పుల్‌‌‌‌ షాట్‌‌‌‌తో ఫోర్‌‌‌‌ కొట్టి 64 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేసుకున్నాడు. కాసేపటికే  హాఫ్‌‌‌‌ సెంచరీ కంప్లీట్‌‌‌‌ చేసుకున్న రషీద్‌‌‌‌ కూడా గేరు మార్చాడు. సిన్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ వేసిన 39వ ఓవర్లో రెండు ఫోర్లతో ఊపులోకి వచ్చాడు. చివరి పవర్‌‌‌‌ ప్లే స్టార్టవగానే వీళ్ల ఆట టాప్​ లెవెల్​కు చేరుకుంది. సాల్జ్‌‌‌‌మన్‌‌‌‌ వేసిన 41వ  ఓవర్లో రషీద్​ సూపర్‌‌‌‌ షాట్లతో హ్యాట్రిక్‌‌‌‌ ఫోర్లు, ఆ వెంటనే  నిస్బెట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో లాంగాన్‌‌‌‌ మీదుగా భారీ సిక్స్‌‌‌‌ కొట్టి 90ల్లోకి వచ్చాడు. మరోవైపు కెప్టెన్‌‌‌‌ యశ్​ 45వ ఓవర్లో వరుసగా 4,4, 2తో సెంచరీ కంప్లీట్‌‌‌‌ చేసుకొని తర్వాతి బాల్‌‌‌‌నే సిక్స్‌‌‌‌ కొట్టాడు. కానీ, నెక్స్ట్​ ఓవర్లోనే యశ్‌‌‌‌తో పాటు రషీద్‌‌‌‌ను దురదృష్టం వెంటాడింది. యశ్‌‌‌‌ రనౌటవగా, రషీద్​పాయింట్‌‌‌‌లో సిన్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. బాల్‌‌‌‌ ముందుగా  గ్రౌండ్‌‌‌‌ను తాకినట్టు అనుమానం కలిగినా.. రీప్లేలో క్లారిటీగా కనిపించలేదు. ఫీల్డ్‌‌‌‌ అంపైర్‌‌‌‌ నిర్ణయం ప్రకారం క్రీజు వీడిన రషీద్‌‌‌‌ సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో  హంగార్గేకర్‌‌‌‌ (13) ఓ సిక్స్‌‌‌‌, ఫోర్‌‌‌‌తో స్పీడ్‌‌‌‌గా ఆడగా.. లాస్ట్‌‌‌‌ ఓవర్లో  నిషాంత్‌‌‌‌ (12 నాటౌట్​), దినేశ్‌‌‌‌ బానా రెచ్చిపోయారు. ఫస్ట్‌‌‌‌ రెండు బాల్స్‌‌‌‌కు నిషాంత్‌‌‌‌ 4, 6 కొట్టగా.. చివరి మూడు బాల్స్‌‌‌‌కు దినేశ్‌‌‌‌ 6, 4, 6 బాది ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌కు  ఊహించని ముగింపు లభించింది.