
మీర్పూర్: బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో వన్డేల్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన ఇండియా విమెన్స్ టీమ్ మూడు వన్డేల సిరీస్‌లో చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అయింది. బుధవారం జరిగే రెండో వన్డేలో బంగ్లాతో పోటీ పడనుంది. మీర్పూర్‌లోని స్లో వికెట్లపై బంగ్లా లెగ్స్పిన్నర్లను ఎదుర్కోలేక ఇండియా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడితే బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన జట్టుగా నిలిచే ప్రమాదం ఉండటంతో హర్మన్ అండ్ కో ఎలాగైనా గెలవాలని ఆశిస్తోంది. బౌలర్లు బాగానే రాణిస్తున్న నేపథ్యంలో బ్యాటర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది.