
కార్డిఫ్ : వరల్డ్‌కప్ ముందు ఇండియా ఆఖరి సన్నాహకానికి రెడీ అయిం ది. తొలి వామప్ లో చెత్తగా ఆడి న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీ సేన బంగ్లాదేశ్ తో మంగళవారం అఖరి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుం ది. గత మ్యాచ్ లో స్వింగ్, బౌలర్లకు అనుకూలించిన పిచ్ పై తేలిపోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలని చూస్తోం ది. అయితే, ఐపీఎల్ లో గాయపడిన కేదార్‌జాదవ్ పై స్పష్టత లేకపోగా ప్రాక్టీస్ సెషన్ లో విజయ్ శంకర్ గాయపడడం మరింత ఆందోళన రెకేత్తిస్తోం ది. ఈ మ్యాచ్ లో వీరిద్దరూ బరిలోకి దిగడం అనుమానమే. ఇక న్యూజిలాండ్ పై విఫలమైన బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌ను సద్వి నియోగం చేసుకోవాలని చూస్తున్నారు .
బంగ్లాపై మంచి రికార్డు ఉన్న రోహిత్‌శర్మ, శిఖర్ ధవన్ బ్యాట్ ఝుళిపిం చాలని కోరుకుం-టున్నారు . కీలకమైన నాలుగో స్థానంలో లోకేశ్ రాహుల్ కు మరో అవకాశం దక్కనుం ది. బంగ్లాపై రాణిస్తే ప్రస్తుతానికి నాలుగో నంబర్ అతని వశమైనట్లే. అయితే ప్రయోగాత్మకంగా దినేశ్ కార్తీక్ ను ఈ స్థానంలో ఆడించే చాన్స్ ఉంది. మిడిలార్డర్ లో హార్దిక్ ఫర్వా లేదనిపించగా, గత మ్యాచ్ లో మాజీ కెప్టెన్ ధోనీ అసౌకర్యంగా కన్పించాడు. ఈ నేపథ్యంలో ఈమ్యాచ్ లో సత్తాచాటి లీగ్ మ్యాచ్‌లకు ముందు ఆత్మవిశ్వా సం కూడగట్టుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోం ది. కుల్దీప్ కూడా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.