ఒకపక్క చర్చలు.. మరోపక్క కయ్యాలు!

ఒకపక్క చర్చలు.. మరోపక్క కయ్యాలు!

ఆయన కమ్యూనిస్ట్​ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడే పబ్లిక్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్. ఇంటర్​పోల్​లో ఓ పెద్ద పోస్టు కోసం ఆయన్ను ఫ్రాన్స్​కు పంపుతున్నట్టు ఆ ప్రభుత్వమే నాటకమాడింది. కానీ, మూడేండ్లుగా ఆయన జాడ లేకుండాపోయింది. ఆయన్ను అరెస్ట్​ చేసిన చైనా ప్రభుత్వం.. జైలులో బంధించింది. ఆయన ఎక్కడున్నాడన్నది కూడా తెలియదు. ఇంటర్​పోల్ ప్రెసిడెంట్​గా పనిచేసిన ఆయన పేరు మెంగ్​ హోంగ్​వీ. ఆయన భార్య గ్రేస్​ మెంగ్​ ప్రస్తుతం ఫ్రాన్స్​లోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి బతుకుతోంది. చైనా అంటేనే ఆమె మండిపడుతోంది. తన పిల్లలను తానే తినేసే పెద్ద భూతం చైనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకప్పుడు చైనా గురించి చెప్పడానికే భయపడిన ఆమె.. ఇప్పుడు మీడియా ముందుకు ధైర్యంగా వచ్చి చైనా ప్రభుత్వంపై పెదవి విప్పింది. చివరిసారిగా తన భర్తతో 2018 సెప్టెంబర్​25న మాట్లాడానని ఆమె చెప్పింది. అది కూడా రెండు మెసేజ్​లను మాత్రం పంపించాడని పేర్కొంది. ఫస్ట్ మెసేజ్​లో ‘నేనే కాల్ చేస్తాను’ అని పెట్టాడని చెప్పింది. రెండో మెసేజ్​లో కిచెన్ కత్తి ఎమోజీని పంపాడని తెలిపింది. దీంతో ఆయన డేంజర్​లో పడ్డాడని అర్థమైందంటూ ఏడ్చింది. అప్పట్నుంచి మెంగ్​జాడ లేకుండా పోయాడని తెలిపింది.

న్యూఢిల్లీ: లడఖ్ లో బార్డర్ గొడవలపై మన ఆర్మీ ఆఫీసర్లతో ఒకపక్క చర్చలు జరుపుతున్న చైనా.. మరోపక్క కయ్యానికి కాలు దువ్వుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఓ విలేజ్ కట్టిందని ఇంతకుముందే బయటపడగా.. తాజాగా ఇంకో విలేజ్ ను కూడా కట్టినట్లు శాటిలైట్ ఇమేజెస్ లో తేటతెల్లం అయిపోయింది. మనతో మాత్రమే కాదు.. అటు భూటాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి పొరుగు దేశాలతోనూ డ్రాగన్ కవ్వింపు చేష్టలకు పాల్పడుతోంది. గత ఏడాది కాలంలో భూటాన్ భూభాగంలోనూ చైనా నాలుగు విలేజ్ లను కట్టిందని వెల్లడైంది. మరోవైపు తైవాన్ ను స్వాధీనం చేసుకుంటామని చైనా ఇటీవల తరచూ ప్రకటనలు చేస్తోంది. తాజాగా సౌత్ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ పడవలపైనా వాటర్ క్యానన్ లను ప్రయోగించింది.  

అరుణాచల్​లో రెండో ఊరు..   
అరుణాచల్ ప్రదేశ్​లో చైనా ఇంకో ఊరును కట్టేసింది. మన దేశం లోపలికి 6 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి.. 60 ఇండ్లను నిర్మించేసింది. మాక్సార్​ టెక్నాలజీస్, ప్లానెట్​ ల్యాబ్స్​అనే రెండు ప్రముఖ సంస్థలు తీసిన శాటిలైట్ ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ – ఎల్​ఏసీ), ఇంటర్నేషనల్ బార్డర్ (ఐబీ) మధ్య షి యోమీ అనే జిల్లాలో ఆ గ్రామాన్ని నిర్మించినట్టు ఆ ఫొటోల ద్వారా తెలుస్తోంది. అది తమ ప్రాంతం అని చెప్పుకొనేలా ఓ కట్టడం పైకప్పుపై చైనా జెండాను కూడా పెయింట్ చేయించింది. చైనా కట్టిన ఆ గ్రామం మన భూభాగంలోనే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భారత్ ​మ్యాప్స్ ​కూడా స్పష్టం చేసింది. సర్వే ఆఫ్​ ఇండియా వెబ్​సైట్ నుంచి తీసుకున్న జియోగ్రాఫిక్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​ డేటా కూడా ఆ ఊరు మన దేశ భూభాగంలోనే ఉన్నట్టు తేలిందని యూరప్​కు చెందిన ఫోర్స్​ అనాలిసిస్ అనే సంస్థ చీఫ్​ మిలటరీ అనలిస్ట్ సిమ్​ ట్యాక్​ చెప్పారు. దీనిపై ఇండియన్​ ఆర్మీని ప్రశ్నించగా.. అది మన దేశ భూభాగంలో లేదని ఓ ఉన్నతాధికారి సమాధానం చెప్పారు. 

భూటాన్ లోనూ డ్రాగన్ విలేజ్ లు 
భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూభాగంలోనూ చైనా ఏడాదిలో నాలుగు గ్రామాలను నిర్మించింది. వీటికి సంబంధించి శాటిలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త గ్రామాలు ఉన్నాయి. చైనా, ఇండియా బలగాలు పరస్పరం గొడవకు దిగిన డోక్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ విలేజ్ లు ఉన్నట్లు శాటిలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన బార్డర్ విషయంలో చైనా నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ రెండు దేశాల ఒప్పందంలో భాగంగానే అక్కడ చైనా నిర్మాణాలు చేపట్టి ఉండొచ్చని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు. 

త్వరలోనే 14వ రౌండ్​ చర్చలు
ఎల్​ఏసీ వద్ద ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసేందుకు ఇండియా, చైనా అంగీకారానికి వచ్చాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ ప్రాంతంలో స్థిరత్వం కోసం కృషి చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. త్వరలోనే  14వ రౌండ్​ సీనియర్​ కమాండర్​ స్థాయి అధికారుల చర్చలకు 2  దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఎల్​ఏసీకి సమీపంలోని దెప్సాంగ్​ వద్ద ప్రస్తుతం ఉన్న స్టాండాఫ్​పై త్వరలోనే పరిష్కారం చేసుకునేందుకు అంగీకరించినట్టు తెలిపింది. గురువారం రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు.. వర్కింగ్​ మెకానిజమ్​ ఫర్​ కన్సల్టేషన్​ అండ్​ కో–ఆర్డినేషన్​(డబ్ల్యూఎంసీసీ) నిర్వహించిన వర్చువల్​ మీటింగ్​లో పాల్గొన్నారు. మన దేశం తరఫున విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి నవీన్​ శ్రీవాస్తవ నేతృత్వంలో ఆర్మీ, ఐటీబీపీ, హోం శాఖ, రక్షణ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్​ 10న జరిగిన 13వ రౌండ్​ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే 
ముగిశాయి.