ODI World Cup 2023: గెలిచి పదేళ్లు దాటింది..ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా..?

ODI World Cup 2023: గెలిచి పదేళ్లు దాటింది..ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా..?

వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి అజేయంగా నిలిచింది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ కు వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో నేడు ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో ప్రత్యేకంగా నిరూపించుకునేది ఏమీ లేదు. జట్టుపై ఎలాంటి ఒత్తిడి కూడా లేదు. అయితే కొన్ని లెక్కలు సరిచేయాల్సిన సమయం మాత్రం వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ లో పటిష్టమైన ఇంగ్లాండ్ తో భారత్ నేడు (అక్టోబర్ 29) తలపడబోతుంది. లక్నో ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో రోహిత్ సేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా.. మన క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పై ఐసీసీ టోర్నీల్లో గెలిచి పదేళ్లు దాటిపోయింది. ఈ పదేళ్లలో ఆడింది రెండే మ్యాచ్ లైనా టీమిండియాకు ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. వీటిలో ఒకటి 2019 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కాగా.. మరొకటి 2022 టీ 20 వరల్డ్ ఫైనల్. 

2019 లో ఇంగ్లాండ్ ఆతిధ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ లో సొంతగడ్డపై మోర్గాన్ సేన భారత్ ను ఓడించింది. ఇంగ్లాండ్ విధించిన 338 పరుగుల  భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తయింది. ఈ రెండు మ్యాచ్ లకు నేడు ప్రతీకారం తీసుకునే సమయం రానే వచ్చింది. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ ఏమంత గొప్ప ఫామ్ లో  లేదు. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లొ ఓడింది. మరోవైపు భారత్ సొంతగడ్డపై రెచ్చిపోయి ఆడుతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి  ఓటమెరుగని జట్టుగా తన జైత్రయాతను కొనసాగిస్తుంది. దీంతో ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని అభిమానులు భావిస్తున్నారు. మరి అనుకున్నట్లుగానే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా..? లేకపోతే ఇంగ్లాండ్ చేతిలో మరో పరాభవాన్ని ఎదుర్కొంటుందేమో చూడాలి.