పంత్ మరింత తడాఖా చూపిస్తాడు

పంత్ మరింత తడాఖా చూపిస్తాడు

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‌ ఇటీవల బాగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్.. ఇంగ్లండ్‌‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌‌లోనూ అటాకింగ్ గేమ్‌‌తో ఆకట్టుకుంటున్నాడు. చెత్త కీపర్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న పంత్.. ఇంగ్లీష్ టీమ్‌‌తో జరుగుతున్న సిరీస్‌‌లో వికెట్ల వెనుక తన ట్యాలెంట్‌‌ను ప్రదర్శిస్తున్నాడు. బంతి సుడులు తిరిగిన రెండో టెస్ట్‌‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌‌లు, స్టంపింగ్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో పంత్‌‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కోవలోకి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, లెజెండరీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ కూడా చేరాడు.

మున్ముందు పంత్ మరింతగా తడాఖా చూపిస్తాడని గిల్లీ చెప్పాడు. భారత కెప్టెన్ కోహ్లి కూడా పంత్‌‌ను మెచ్చుకున్నాడు. ‘కీపింగ్ విషయంలో పంత్ చాలా శ్రమించాడు. ఇప్పుడు అతడు కీపింగ్ చేస్తున్నప్పుడు గ్లోవ్స్‌‌తో కదలికలను గమనిస్తే చాలా మార్పులు కనిపిస్తాయి. బరువు తగ్గడంతో మరింత వేగంగా కాళ్లను కదుపుతున్నాడు. టర్న్, బౌన్స్ ఎక్కువగా ఉన్న ఈ పిచ్‌‌పై ఇంతబాగా కీపింగ్ చేసినందుకు పంత్‌‌ను ప్రశంసించాల్సిందే. ఇలాగే మంచి కీపర్‌‌గా అతడు ముందుకెళ్లాలి. టీమ్‌కు పంత్ అవసరం చాలా ఉంది’ అని కోహ్లి చెప్పాడు.