క్రికెట్ ఫ్యాన్స్ కి పండగే.. భారత్– న్యూజిలాండ్ మధ్య ఏకంగా 40 రోజుల పాటు సిరీస్

క్రికెట్ ఫ్యాన్స్ కి పండగే.. భారత్– న్యూజిలాండ్ మధ్య ఏకంగా 40 రోజుల పాటు సిరీస్

IND vs NZ Schedule: భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త పండుగ లాంటి వార్త వచ్చేసింది. టీమిండియా (Team India) మరో చారిత్రాత్మక సుదీర్ఘ పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంది. న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్ బోర్డు తమ అంతర్జాతీయ హోం సీజన్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్, బ్లాక్‌క్యాప్స్ జట్లు మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 12 మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన ఈ సిరీస్ కివీస్ క్రికెట్ చరిత్రలోనే పెద్ద టూర్ నిర్వహించబోతుంది. 

టీ20, వన్డే సిరీస్ పూర్తి వివరాలు ఇవే: 
ఈ సుదీర్ఘ టూర్ అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో స్టార్ట్ కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 24న రెండో టీ20 (క్రైస్ట్‌చర్చ్), అక్టోబర్ 27న మూడో టీ20 (వెల్లింగ్టన్), అక్టోబర్ 30న నాలుగో టీ20 (ఆక్లాండ్), నవంబర్ 1న హామిల్టన్‌లో ఐదో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. నవంబర్ 4న ఆక్లాండ్‌లో తొలి వన్డే, నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో రెండో వన్డే, నవంబర్ 10న హామిల్టన్‌లో మూడో వన్డే జరగనున్నాయి. ఆపై నవంబర్ 13, 15 తేదీల్లో చివరి రెండు వన్డేలకు మౌంట్ మాంగనుయ్ వేదికగా నిర్వహిస్తుంది. 

►ALSO READ | సిరాజ్ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్.. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కి జమ్మూ పేసర్ ఆకిబ్ నబీ ఛాన్స్

టెస్ట్ సిరీస్‌తో ముగియనున్న భారత టూర్: 
భారత్– న్యూజిలాండ్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత కివీస్ గడ్డపై భారత్ టెస్ట్ ఫార్మాట్ ఆడనుండటంతో దీనిపై అందరి దృష్టి నెలకొంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ కొనసాగనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా సుమారు 40 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగియనుంది.  

టీ20 సిరీస్ షెడ్యూల్:
* మొదటి టీ20: అక్టోబర్ 22 – క్రైస్ట్‌చర్చ్
* రెండో టీ20: అక్టోబర్ 24 – క్రైస్ట్‌చర్చ్
* మూడో టీ20: అక్టోబర్ 27 – వెల్లింగ్టన్
* నాలుగో టీ20: అక్టోబర్ 30 – ఆక్లాండ్
* ఐదో టీ20: నవంబర్ 1 – హామిల్టన్

వన్డే సిరీస్ షెడ్యూల్:
* మొదటి వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్
* రెండో వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్
* మూడో వన్డే: నవంబర్ 10 – హామిల్టన్
* నాలుగో వన్డే: నవంబర్ 13 – మౌంట్ మాంగనుయ్
* ఐదో వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్

టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
* మొదటి టెస్ట్: నవంబర్ 19 - 23 – వెల్లింగ్టన్
* రెండో టెస్ట్: నవంబర్ 27 - డిసెంబర్ 1 (2026) – క్రైస్ట్‌చర్చ్