సోషల్ మీడియాలో హోరెత్తుతోన్న బైకాట్ ట్రెండ్.. ఇండియా-పాక్ మ్యాచ్ జరిగేనా..?

సోషల్ మీడియాలో హోరెత్తుతోన్న బైకాట్ ట్రెండ్.. ఇండియా-పాక్ మ్యాచ్ జరిగేనా..?

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2025లో భాగంగా మరి కొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోరాత్రి 8 గంటలకు దాయాదుల పోరు ప్రారంభం కానుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‎ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతమయ్యాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్‎ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‎ను చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గాం దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. 

మరికొందరు క్రికెట్‎ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నా రు. దాయాదుల మధ్య పోరుకు అభిమానులు సైతం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని టాక్. టికెట్లను అమ్మకానికి పెట్టి, దాదాపు11 రోజులు కావస్తోన్నా ఇంకా 50 శాతం టికెట్లు అమ్ముడు పోకుండా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మరికొందరూ ఇటీవల సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించా రు. 

అయితే క్రికెట్ రాజకీయాలతో ముడి పెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22ను కశ్మీర్ పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. లష్కరే తోయిబా ప్రాక్సీసంస్థ అయిన  రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‎తో పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. పాక్ సైన్యం భారత్‎పై దాడికి యత్నించడంతో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని నాశనం చేసింది.

హైటెన్షన్..

హైటెన్షన్ పరిస్థితుల్లో పాక్‎తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. ఓ వైపు నెట్టింట 'బాయ్ కాట్' ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా మేనేజ్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇతర మ్యాచుల మాదిరిగానే భావించాలని.. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా వ్యవహరించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎తో పాటు ఇతర మ్యాచుల మాదిరిగానే భావించాలని.. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా వ్యవహరించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎తో పాటు ఇతర సహాయక బృందం చెప్పినట్లు తెలుస్తోంది. మ్యాచ్‎కు ముందు నిర్వహించాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ కోచ్, కెప్టెన్ లేదా ఇతర ఏ ఆటగాడూ పాల్గొనకపోవడం గమనార్హం.