ఇయ్యాళ సౌతాఫ్రికాతో ఇండియా రెండో వన్డే

ఇయ్యాళ సౌతాఫ్రికాతో ఇండియా రెండో వన్డే

మ. 1.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్‌ లో

రాంచీ:  టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌ కోసం రోహిత్‌‌సేన ఆస్ట్రేలియాలో ఉండగా.. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌లో శిఖర్‌‌ ధవన్‌‌ కెప్టెన్సీలోని  టీమిండియా చావోరేవో తేల్చుకోనుంది. బౌలర్లు, టాపార్డర్‌‌ ఫెయిల్యూర్‌‌తో తొలి వన్డేలో ఓడిపోయిన ఇండియా ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌‌లో నిలవాలని చూస్తోంది. అయితే, గాయంతో దీపక్‌‌ చహర్‌‌ దూరం అవడంతో బౌలింగ్‌‌ మరింత వీక్‌‌ అయింది.  లక్నోలో తొలి మ్యాచ్‌‌కు ముందు చహర్​ చీలమండకు గాయం అయింది. వెన్నునొప్పి కూడా తిరగబెట్టడంతో అతడిని సిరీస్‌‌ నుంచి తప్పించారు. గత మ్యాచ్‌‌లో హైదరాబాదీ సిరాజ్‌‌, అవేశ్‌‌ ఖాన్‌‌ తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఒకరిని తప్పించి బెంగాల్‌‌ అన్‌‌క్యాప్డ్‌‌  పేసర్‌‌ ముకేశ్‌‌ కుమార్‌‌కు చాన్స్‌‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లక్నోలో ఫెయిలైన కెప్టెన్‌‌ ధవన్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, ఇషాన్‌‌, రుతురాజ్‌‌ పుంజుకుంటేనే ఇండియా ఈ పోరులో గెలిచి సిరీస్‌‌లో నిలవగలదు. గత పోరులో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌‌ చేయడం సానుకూలాంశం. టీ20 వరల్డ్‌‌కప్‌‌ స్టాండ్‌‌బై జాబితాలో ఉన్న శ్రేయస్‌‌లో ఈ ఇన్నింగ్స్‌‌ కచ్చితంగా కాన్ఫిడెన్స్‌‌ నింపుతుంది. షార్ట్‌‌ బాల్స్‌‌ ఎదుర్కోవడంలో,  పేసర్ల బౌలింగ్‌‌లో స్లో స్ట్రయిక్‌‌ రేట్‌‌ వీక్‌‌నెస్‌‌ ఉన్న అయ్యర్‌‌ లక్నోలో కౌంటర్‌‌ అటాక్‌‌తో మెప్పించాడు. అదే సమయంలో సంజూ శాంసన్‌‌ కూడా ఫామ్‌‌లోకి రావడం మరో ప్లస్‌‌ పాయింట్‌‌. అయ్యర్‌‌, శాంసన్‌‌ ఇదే జోరు కొనసాగించడంతో పాటు ధవన్‌‌ నేతృత్వంలోని టాపార్డర్‌‌ కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

చహర్‌‌ ప్లేస్‌‌లో  సెలెక్టర్లు స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ సుందర్‌‌ను జట్టులో చేర్చారు. అయితే తను తుది జట్టులోకి వచ్చే చాన్స్‌‌ కనిపించడం లేదు. మరోవైపు సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌‌ జోరును కొనసాగించి రాంచీలోనే సిరీస్‌‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో వచ్చే వన్డే వరల్డ్‌‌ కప్‌‌నకు నేరుగా అర్హత సాధించేందుకు అవసరమైన కీలక పాయింట్లను రాబోయే రెండు వన్డేల్లో రాబట్టాని టెంబా బవూమ కెప్టెన్సీలోని సఫారీలు భావిస్తున్నారు. బవూమ గత మూడు టీ20లు, వన్డేలో వరుసగా 0, 0, 3, 8 స్కోర్లతో నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్‌‌కప్‌‌ సమీపిస్తున్న నేపథ్యంలో  తిరిగి ఫామ్‌‌ అందుకోవాలని కోరుకుంటున్నాడు. డికాక్‌‌, మిల్లర్‌‌, క్లాసెన్‌‌ ఫామ్‌‌లో ఉండటం సఫారీలకు ప్లస్‌‌ పాయింట్‌‌.