ఇవాళ సౌతాఫ్రికాతో టీమిండియా ఫస్ట్ టీ20

ఇవాళ సౌతాఫ్రికాతో టీమిండియా ఫస్ట్ టీ20
  • ఇవాళ సౌతాఫ్రికాతో ఫస్ట్‌‌‌‌ టీ20
  • వరుసగా13వ విజయంపై గురి
  • గాయాలతో రాహుల్‌‌, కుల్దీప్‌‌ ఔట్‌‌
  • రా. 7 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో

న్యూఢిల్లీ: ఓవైపు టీ20 వరల్డ్‌‌కప్‌‌కు టైమ్‌‌ దగ్గరపడుతున్న వేళ.. మరోవైపు సీనియర్లకు విశ్రాంతి.. ఈ నేపథ్యంలో యంగ్‌‌ టీమిండియా.. నేషనల్‌‌ డ్యూటీకి రెడీ అయ్యింది. ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌లో భాగంగా ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌‌లో ఇండియా... సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. కెప్టెన్‌‌ రోహిత్‌‌, కోహ్లీ, బుమ్రాకి విశ్రాంతి ఇవ్వగా, కాలిపిక్క గాయంతో కేఎల్‌‌ రాహుల్‌‌ సిరీస్‌‌ మొత్తానికి దూరం అయ్యారు. దాంతో, రిషబ్​ పంత్​కు కెప్టెన్సీ ఇచ్చారు. తొలిసారి నేషనల్​ టీమ్​ను నడిపిస్తున్న పంత్​ సారథ్యంలో కుర్రాళ్లు ఏం చేస్తారనే ఆసక్తి మొదలైంది.ఈ సిరీస్​ ద్వారా వరల్డ్‌‌కప్‌‌ ప్రాబబుల్స్‌‌పై ఓ స్పష్టతకు రావాలని చీఫ్‌‌ కోచ్‌‌ ద్రవిడ్‌‌ యోచిస్తున్నాడు. దీనికి తోడు ఇప్పటికే 12 వరుస విజయాలతో ఉన్న టీమిండియా.. మరోటి సాధిస్తే వరల్డ్‌‌ రికార్డు అవుతుంది. ఈ మ్యాచ్‌‌లో గెలిచి మెగా ఘనతను అందుకోవాలని కూడా టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 నుంచి ఇండియాలో వైట్‌‌బాల్‌‌ సిరీస్‌‌ ఓడిపోని సౌతాఫ్రికా కూడా దానిని కొనసాగించాలని భావిస్తోంది.