Team India: ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు రంగం సిద్ధం.. షెడ్యూల్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు!

Team India: ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు రంగం సిద్ధం.. షెడ్యూల్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు!

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం (నవంబర్ 30) జరుగుతుంది. రాంచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై టీమిండియా  ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. తొలి వన్డే కోసం ఇప్పటికే టీమిండియా బుధవారం (నవంబర్ 26) ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు రాంచీ చేరుకుంది. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. సీనియర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీతో పాటు ఎనిమిది నెలల తర్వాత స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా మళ్లీ వన్డే సెటప్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు.

షెడ్యూల్, టైమింగ్: 

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతాయి. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు జరుగుతాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది.  ఈ సిరీస్ లో అందరి కళ్ళు రోహిత్, కోహ్లీపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్ లో విఫలమైన కోహ్లీ సౌతాఫ్రికాపై ఆడి ఫామ్ లోకి రావడం కీలకంగా మారింది. 

వన్డే సిరీస్ తర్వాత భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. 

ALSO READ : WBBL నుంచి వైదొలిగిన జెమీమా..

సౌతాఫ్రికాతో మూడు వన్డేలకు భారత జట్టు:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్ 

సౌతాఫ్రికా జట్టు: 

టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, డెవాల్డ్ బ్రీవిస్ , నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మాన్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బోష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడిన్, ర్యాన్నే రిక్కెల్టన్, ప్రెయాన్ రిక్లెన్‌రేన్