IND vs SA: ఇండియా, సౌతాఫ్రికా తొలి టెస్ట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు ఇవే!

IND vs SA: ఇండియా, సౌతాఫ్రికా తొలి టెస్ట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు ఇవే!

ఆస్ట్రేలియాతో వైట్‌‌‌‌ బాల్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను పూర్తి చేసుకున్న టీమిండియా ఇప్పుడు సౌతాఫ్రికాతో రెడ్‌‌‌‌ బాల్ సవాల్‌‌‌‌కు రెడీ అవుతోంది. ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు భారీ హైప్ నెలకొంది. రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో మొదలయ్యే తొలి టెస్టు కోసం శుభ్‌‌‌‌మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.  ఈ క్రేజీ టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన సౌతాఫ్రికాపై సిరీస్ కావడమే ఇందుకు కారణం. ఐకానిక్ స్టేడియం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ కు టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. 

రెండు టెస్ట్ మ్యాచ్ ల షెడ్యూల్: 

నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ టూర్ లో భాగంగా మొదట టెస్ట్ సిరీస్ జరగనుంది. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియం రెండో టెస్ట్ కు ఆతిధ్యమిస్తుంది.

టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

రెండు టెస్టులు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టాస్ ఉదయం 9:00 గంటలకు వేస్తారు (రెండో టెస్ట్ టైమింగ్స్ ఇంకా ప్రకటించలేదు) .  

లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ రెండు టెస్టులను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు. 

ఇండియాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు:

టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్ , ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డి జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, కాగిసో రబడా, సిమోన్ హార్మర్    

►ALSO READ | IPL 2026: ట్రేడింగ్‌లో బిగ్ ట్విస్ట్.. రాజస్థాన్ కెప్టెన్సీ కావాలని డిమాండ్ చేసిన జడేజా

సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఇండియా జట్టు:
 
శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్