
న్యూఇయర్ ను పొట్టి క్రికెట్ తో స్టార్ట్ చేసింది ఇండియా. శ్రీలంకతో గువహాటిలో జరుగుతున్న తొలి టీ20 లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది . అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. శ్రీలంకతో మూడు టీ20 ఆడనుంది ఇండియా. ఈ టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేసులో శిఖర ధావన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఒపెనర్ గా రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆడనున్నాడు. అలాగే మూడు నెలల తర్వాత జస్పిత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు.